Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హ్యుందాయ్ మోటర్ ఇండియా ఫౌండేషన్ ద్వారా రూ. 3.38 కోట్ల విలువైన స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్

image

ఐవీఆర్

, శుక్రవారం, 16 ఆగస్టు 2024 (22:42 IST)
హ్యుందాయ్ మోటర్ ఇండియా లిమిటెడ్ యొక్క దాతృత్వ విభాగం, హ్యుందాయ్ మోటర్ ఇండియా ఫౌండేషన్, సివిల్ సర్వీసెస్ పరీక్ష, కామన్ లా అడ్మిషన్ టెస్ట్ కోసం సిద్ధమవుతున్న బీద వర్గాలకు చెందిన అభ్యర్థులకు సహాయం చేయడానికి, భారతదేశం అంతటా ఐఐటి విద్యార్థుల ప్రాజెక్ట్‌లకు మద్దతు అందించటానికి 'హ్యుందాయ్ హోప్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్'ని ప్రారంభించింది. 
 
ఈ కార్యక్రమాన్ని గౌరవనీయులైన భారత ప్రభుత్వ భారీ పరిశ్రమలు-ఉక్కు శాఖల మంత్రి, శ్రీ. హెచ్.డి. కుమారస్వామి, వర్టికల్ హెడ్-కార్పొరేట్ కమ్యూనికేషన్ & సోషల్, హెచ్ఎంఐఎల్ శ్రీ పునీత్ ఆనంద్ సమక్షంలో ప్రారంభించారు. ఈ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌లో భాగంగా, హెచ్ఎంఐఎఫ్ రూ. 3.38 కోట్లు పెట్టుబడి పెడుతుంది, 300 మంది ఆశావహులు, 150 ఐఐటి విద్యార్థి బృందాలకు ప్రయోజనం చేకూర్చనుంది.
 
ప్రోగ్రాం ప్రారంభం సందర్భంగా, హెచ్ఎంఐఎల్, కార్పొరేట్ కమ్యూనికేషన్ & సోషల్, వెర్టికల్ హెడ్ శ్రీ పునీత్ ఆనంద్ మాట్లాడుతూ, “హ్యుందాయ్ యొక్క 'ప్రోగ్రెస్ ఫర్ హ్యుమానిటీ' అనే ప్రపంచ లక్ష్యంకు అనుగుణంగా , భాగస్వామ్య విలువని సృష్టించి, సమాజంలో సానుకూల మార్పును తీసుకురావటాన్ని మేము విశ్వసిస్తున్నాము. ఔత్సాహిక ప్రతిభావంతులకు వారి లక్ష్యాలపై దృష్టి పెట్టడంలో సహాయపడటానికి సామాజిక, భావోద్వేగ మరియు ఆర్థిక సహాయాన్ని అందించడం ద్వారా హ్యుందాయ్ హోప్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ భవిష్యత్ నాయకులను, చేంజ్ మేకర్స్‌ను తీర్చిదిద్దటానికి ఉద్దేశించబడింది,  హ్యుందాయ్ హోప్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ ద్వారా, మేము సమాన అవకాశాలను అందించటం, భారతదేశంలోని తరువాతి తరం నాయకులను శక్తివంతం చేయడం, దేశం యొక్క సామాజిక- ఆర్థిక వృద్ధికి మద్దతు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకున్నాము. ఈ కార్యక్రమం ఆర్థిక సహాయం, సమగ్ర వనరులు, మార్గదర్శకత్వం, మద్దతు వ్యవస్థలను అందిస్తుంది, యువ ప్రతిభావంతులు వారి విద్యా విషయాలపై దృష్టి పెట్టడానికి మరియు వారు ఎంచుకున్న రంగాలలో రాణించడానికి వీలు కల్పిస్తుంది..." అని అన్నారు. 
 
కార్యక్రమ ప్రాముఖ్యత గురించి గౌరవనీయులైన కేంద్ర భారీ పరిశ్రమలు- ఉక్కు శాఖల మంత్రి శ్రీ హెచ్.డి.కుమారస్వామి మాట్లాడుతూ, "హ్యుందాయ్ హోప్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ హ్యుందాయ్ మోటర్ ఇండియా ఫౌండేషన్ చేపట్టిన ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. తాము చూడాలనుకుంటున్న మార్పు కోరుకుంటున్న సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులను ఆదుకునే ఆలోచనాత్మక విధానాన్ని మేము అభినందిస్తున్నాము.  చాలా మంది అర్హులైన అభ్యర్థులకు, ప్రత్యేకించి సివిల్ సర్వీసెస్, లా మరియు సాంకేతికత వంటి కీలకమైన రంగాలలో ఆర్థిక పరిమితులు తరచుగా ఒక భయంకరమైన అవరోధంగా మారతాయి. ఈ సమ్మిళిత ప్రయత్నం దేశం యొక్క అభివృద్ధిలో చాలా దూరం వెళ్తుంది మరియు దేశ నిర్మాణం పట్ల హ్యుందాయ్ మోటర్ ఇండియా యొక్క నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుంది.." అని అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎల్‌టిఐ మైండ్‌ట్రీ ఫౌండేషన్ సాయంతో 80 మంది యువతకు ఐటీలో ఉద్యోగాలు