Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కనుమరుగవుతున్న భారతదేశపు గిరిజన తెగలను కనుగొనడానికి కృషి చేస్తున్న హ్యుందాయ్ మోటర్ ఇండియా ఫౌండేషన్‌

image

ఐవీఆర్

, సోమవారం, 6 మే 2024 (23:54 IST)
హ్యుందాయ్ మోటర్ ఇండియా ఫౌండేషన్ (హెచ్ఎంఐఎఫ్) భారతదేశం యొక్క గొప్ప సాంప్రదాయ వారసత్వాన్ని ఉద్ధరించే, సంరక్షించే మరియు ప్రచారం చేసే కార్యక్రమాల ద్వారా భారతదేశం, సమాజ అభివృద్ధి పట్ల తన నిబద్ధతను కొనసాగిస్తోంది. ఫౌండేషన్ ప్రయత్నాలు గిరిజన సంక్షేమం, పరిరక్షణకు దోహదపడే అనేక రంగాలపై దృష్టి సారించాయి, ముఖ్యంగా తమిళనాడులోని ఇరుంగట్టుకోట్టైలోని ఇరుల తెగ, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్‌లోని చెంచు తెగ వంటి స్థానిక, బలహీన గిరిజన సంఘాల అభివృద్ధికి కృషి చేస్తుంది. 165 గిరిజన కుటుంబాలు హెచ్ఎంఐఎఫ్ యొక్క సామాజిక కార్యక్రమాలలో భాగంగా దాని అడవుల పెంపకం ప్రయత్నాలకు సంరక్షకులుగా చేర్చబడ్డాయి.
 
అంతరించిపోయే దశలో ఉన్న, అంతరించిపోతున్న సాంస్కృతిక కళారూపాల పరిరక్షణకు కూడా తన ప్రయత్నాలను హెచ్ఎంఐఎఫ్ అంకితం చేసింది. తమిళనాడులోని కట్టైక్కుట్టు సంగం థియేటర్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన సోహ్రాయ్ వాల్ ఆర్ట్, కేరళకు చెందిన ఒట్టం తుల్లాల్ డ్యాన్స్, కర్ణాటకకు చెందిన కవండి మేకింగ్ వంటి వాటి పరిరక్షణకు హెచ్ఎంఐఎఫ్ చేస్తున్న ప్రయత్నాలు దీనికి నిదర్శనం. 
 
ఈ పరిరక్షణ ప్రయత్నాల ప్రభావంపై హ్యుందాయ్ మోటర్ ఇండియా లిమిటెడ్ కార్పొరేట్ వ్యవహారాల ఏవీపీ & వర్టికల్ హెడ్ శ్రీ పునీత్ ఆనంద్ మాట్లాడుతూ, "గిరిజన సంఘాల అభ్యున్నతికి , భారతదేశం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడానికి ప్రయత్నాలను చేస్తున్నాము, హ్యుందాయ్ మోటర్ ఇండియా ఫౌండేషన్ తమ సామాజిక బాధ్యత, హ్యుందాయ్ యొక్క ప్రపంచ లక్ష్యం  'మానవత్వం కోసం పురోగతి' నిబద్ధతలో స్థిరంగా ఉంది. చెంచు, ఇరుల తెగల సభ్యులను దాని అటవీ ప్రయత్నాలలో భాగం చేయడం, వారిని సంరక్షకులుగా నియమించటం ద్వారా, మేము వారి అభ్యున్నతికి, ఆర్థికంగా-సామాజికంగా దోహదపడుతున్నాము. సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడానికి భాగస్వామ్యాలు మరియు కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ పై  హ్యుందాయ్ యొక్క నమ్మకాన్ని మా ప్రయత్నాలు నొక్కి చెబుతున్నాయి.." అని అన్నారు.
 
తమ ప్రయత్నాలలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్‌‌లో చెంచు తెగకు చెందిన 150 కుటుంబాలు నివసించే ఐదు గ్రామాలను హెచ్ఎంఐఎఫ్  గుర్తించి వారికి వ్యవసాయ నైపుణ్యాలు అందించటం, 250 ఎకరాల భూమిలో విస్తరించి ఉన్న ప్రాంతం లో జీవనోపాధి కల్పన కార్యకలాపాల ద్వారా వారికి సాధికారత కల్పించడానికి ప్రయత్నిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎఫికాన్‌ కీటకనాశినితో భారతీయ రైతు పంటలకు బిఎఎస్‌ఎఫ్‌ మద్దతు