Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రానున్న ఐదేళ్లలో భారతదేశంలో అతి-సంపన్న జనాభా సంఖ్య 13,262 నుండి 19,908కు చేరుకుంటుంది: నైట్ ఫ్రాంక్

cash notes

ఐవీఆర్

, బుధవారం, 28 ఫిబ్రవరి 2024 (22:44 IST)
నైట్ ఫ్రాంక్స్ ప్రధాన నివేదిక, సంపద నివేదిక 2024 ప్రకారం, 2023లో 13,263గా ఉన్న భారతీయ అల్ట్రా-హై-నెట్-వర్త్ వ్యక్తుల సంఖ్య 2028 నాటికి 50.1% వృద్ధితో 19,908కు చేరుకోవచ్చు, ఇది రాబోయే ఐదు సంవత్సరాలలో, మరే ఇతర దేశంతో పోల్చిన UHNWIల సంఖ్యలో అత్యధిక వృద్ధి. 2028 నాటికి ప్రపంచవ్యాప్తంగా సంపన్న వ్యక్తుల సంఖ్య 28.1% పెరిగి 8,02,891కు చేరుకుంటుంది అని అంచనా. 2023లో ప్రపంచవ్యాప్తంగా UHNWIల సంఖ్య 4.2% వృద్ధి చెందింది, అంతకుముందు సంవత్సరంలో 601,300 ఉన్న సంఖ్య 626,619కు చేరుకుంది. 2023లో భారతదేశంలో UHNWI జనాభా అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 6.1% వార్షిక వృద్ధితో 13,263గా ఉంది.
 
నైట్ ఫ్రాంక్స్- సంపద నివేదిక 2024 ప్రకారం, 90% భారతీయ UHNWIలు వారి సంపదలో పెరుగుదలను ఆశిస్తున్నారు. వీరిలో 63% UHNWIలు వారి సంపదలో 10% కంటే ఎక్కువ పెరుగుదలను ఆశిస్తున్నారు.
 
నైట్ ఫ్రాంక్ ఇండియా, ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్, శ్రీ. శిశిర్ బైజల్ ఇలా అన్నారు, “గణనీయమైన సంపద సృష్టి పరివర్తన జరుగుతున్న ఈ తరుణంలో, ప్రపంచ ఆర్థిక పరిధిలో భారతదేశం వృద్ధి, పుష్కలమైన అవకాశాలకు చక్కని ఉదాహరణగా నిలుస్తోంది. భారతదేశ UHNWIల సంఖ్యలో రానున్న ఐదు సంవత్సరాలలో 50.1% గణనీయమైన పెరుగుదల ఉంటుందని అంచనా. ఈ పరిణామానికి స్పష్టంగా సూచికగా నిలుస్తోంది. 2024లో 90% భారతీయ UHNWIలు తమ సంపదలో పెరుగుదలను ఊహిస్తుండగా, సమృద్ధి యొక్క మూఖ చిత్రం శక్తివంతంగా, చైతన్యవంతంగా కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి ఉన్నప్పటికీ, దేశీయ ద్రవ్యోల్బణ ప్రమాదాన్ని సరళం చేయడం మరియు రేట్లలో ఆశిస్తున్న తగ్గింపులు భారతీయ ఆర్ధిక వృద్ధిని మరింత పెంచవచ్చు, సంపన్న భారతీయులలోని ఈ ఆశావాహ భావన, దేశ ఆర్ధిక పురోగతిని ధృవీకరిస్తోంది.”
 
నైట్ ఫ్రాంక్ రీసర్చ్ గ్లోబల్ హెడ్, లియమ్ బైలీ, ఇలా అన్నారు, “ఆర్ధికంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో, భవిష్య అభివృద్ధి ప్రధానంగా వేగంగా వృద్ధి చెందుతున్న ఈ మార్కెట్లలోనే ఉంటుందా లేదా అనేది ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న, లేదా నైపుణ్యం ఉన్న ఈ వ్యక్తులు యూరోప్, ఆస్ట్రేలియా, లేదా నార్త్ అమెరికాలకు వెళ్తారా? ఆసియా వెలుపల మిడల్ ఈస్ట్, ఆస్ట్రల్ఏసియా, ఉత్తర అమెరికాలలో బలమైన వృద్ధి కనిపిస్తోంది, యూరోప్ వెనుకబడి ఉంది మరియు ఆఫ్రికా, లాటిన్ అమెరికాలు అత్యంత బలహీనమైన వృద్ధిని కలిగి ఉండే ప్రాంతాలు కావచ్చు.”

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జార్ఖండ్‌లో రైలు ప్రమాదం... 12 మంది దుర్మరణం