Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏప్రిల్ ఒకటి నుంచే ఐటీ రిటర్నులు దాఖలు

Webdunia
గురువారం, 16 ఫిబ్రవరి 2023 (10:21 IST)
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి సంబంధించిన రిటర్నులను ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచే సమర్పించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) వెల్లడించింది. 2023-24 మదింపు సంవత్సరం ప్రారంభం రోజు నుంచే సంబంధిత ఫారాలు అందుబాటులో ఉంటాయని బుధవారం తెలిపింది. 
 
గత ఏడాది ఐటీఆర్‌ పత్రాలతో పోలిస్తే ఈసారి పెద్దగా మార్పులేమీ లేనందున, పన్ను రిటర్నులు దాఖలు చేసేవారు సులభంగా ఈ ప్రక్రియను పూర్తి చేయొచ్చని పేర్కొంది. వ్యక్తులు, వృత్తి నిపుణులు, వ్యాపార సంస్థలు దాఖలు చేయాల్సిన 1-6 వరకు ఐటీఆర్‌ ఫారాలను సీబీడీటీ ఇప్పటికే నోటిఫై చేసింది. 
 
మదింపు సంవత్సరం (అసెస్‌మెంట్‌ ఇయర్‌) ప్రారంభం నుంచే రిటర్నులు దాఖలు చేయడం వల్ల, పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూరుతుందని అభిప్రాయపడింది. సాధారణంగా జులై 31 వరకు రిటర్నులు దాఖలు చేసేందుకు గడువు ఉంటుంది. అనివార్య సందర్భాల్లో సీబీడీటీ ఈ గడువును పొడిగిస్తూ వస్తున్న విషయం తెల్సిందే. దీంతో ఈ యేడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచే ఈ అవకాశం కల్పించడంతో ఐటీ రిటర్నుల దాఖలు గబారా పడాల్సిన అవసరం ఉండదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

ఫస్ట్ టైమ్ హరుడు తో మాస్ చిత్రం చేశా : హీరో వెంకట్

నేను గ్యాప్ తీసుకుంది దాని కోసమే : దర్శకుడు శ్రీను వైట్ల

35వ వార్షికోత్సవంలో అక్కినేని నాగార్జున, రామ్ గోపాల్ వర్మ ల శివ

జెండా ఒక ఖడ్గం అనే ఉద్దేశ్యం తో తీశా : ఖడ్గం రీ రిలీజ్ సందర్భంగా కృష్ణవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments