Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

10-04-2022 నుంచి 16-04-2022 వరకు వార రాశి ఫలితాలు

weekly astro
, శనివారం, 9 ఏప్రియల్ 2022 (21:57 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము 
ఈ వారం గ్రహాల అనుకూలతలున్నాయి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. రాబడిపై దృష్టి పెడతారు. పనులు సానుకూలమవుతాయి. మీ శ్రీమతి సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. కీలక పత్రాలు అందుకుంటారు. కుటుంబీకుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. ప్రముఖుల సందర్శం నిరీక్షణ తప్పదు. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి అధికం. ఉపాధ్యాయులకు స్థానచలనం. నిర్మాణాలు మందకొడిగా సాగుతాయి. బిల్డర్లు, కార్మికులకు కష్టసమయం. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు 
శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. ప్రేమానుబంధాలు బలపడతాయి. మీ ఉన్నతి కొంతమందికి అపోహ కలిగిస్తుంది. విమర్శలు పట్టించుకోవద్దు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పరిచయస్తులు ధనసహాయం అర్థిస్తారు. పెద్ద మొత్తం సాయం తగదు. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్త. స్థిరాస్తి క్రయ విక్రయంలో పునరాలోచన మంచిది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ప్రైవేట్ సంస్థ ఉద్యోగస్తులకు ఒత్తిడి అధికం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. షాపుల స్థలమార్పు అనివార్యం. ప్రముఖులకు స్వాగతం, వీడ్కోలు పలుకుతారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్థ్ర, పునర్వసు 1, 2, 3 పాదములు 
ధైర్యంగా వ్యవహరిస్తారు. మీ కార్యదీక్ష స్ఫూర్తిదాయకమవుతుంది. ప్రశంసలు. పురస్కారాలు అందుకుంటారు. పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు అధికం, డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. బుధ, గురువారాల్లో కొత్త వ్యక్తులతో జాగ్రత్త.
ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. ప్రతి విషయం స్వయంగా తెలుసుకోవాలి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. గుట్టుగా వ్యవహరించండి. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. అధికారులకు హోదామార్పు, స్థానచలనం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. హోల్‌సేల్ వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. స్థలవివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు 
పంతాలు, భేషజాలకు పోవద్దు. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. లౌక్యంగా వ్యవహరించాలి. అవకాశాలు చేజారినా ఒకందుకు మంచిదే. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఖర్చులు విపరీతం. ధనసహాయం అర్థించేందుకు మనస్కరించదు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. ఆది, శనివారాల్లో అనేక పనులతో సతమతమవుతారు. కావలసిన పత్రాలు సమయానికి కనిపించవు. ప్రతి చిన్న విషయానికి అసహనం చెందుతారు. సన్నిహితుల హితవు మీపై సత్ప్రభావం చూపుతుంది. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. సంతానం విషయంలో శుభ ఫలితాలున్నాయి. ఒక ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. కంప్యూటర్, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి వేడుకకు హాజరు కాలేరు. కోర్టు వాయిదాలు చికాకుపరుస్తాయి. 
 
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదము 
కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. వ్యాపకాలు, పరిచయాలు విస్తరిస్తాయి. ఆచితూచి వ్యవహరించాల్సిన సమయం. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. పనుల్లో ఒత్తిడి, ఆటంకాలెదుర్కుంటారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. చేతిలో ధనం నిలవదు. గురు, శుక్రవారాల్లో మీ గౌరవానికి భంగం కలిగే ఆస్కారం ఉంది. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. సామరస్యంగా మెలగండి. గృహంలో అశాంతి నెలకొంటుంధి. ఆత్మీయులను కలుసుకుంటారు. సంతానం విషయంలో మంచి జరుగుతుంది. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ఉపాధి పథకాలు చేపడతారు. చేతివృత్తులు, కార్మికులకు నిరాశాజనకం. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. షాపుల స్థలమార్పు అనివార్యం. పుణ్యకార్యంలో పాల్గొంటారు. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు 
వ్యవహారాల్లో తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. అహం, భేషజాలకు పోవద్దు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు. తెలియని వెలితి వెన్నాడుతుంది. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. సోమ, మంగళవారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ప్రకటనలు, సందేశాలను నమ్మవద్దు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. కీలక పత్రాలు అందుకుంటారు. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్యసేవలు అవసరం. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు సంతృప్తినీయవు. ప్రైవేట్ సంస్థ ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. న్యాయ, వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. జూదాలు, బెట్టింగులకు పాల్పడవద్దు.
 
తుల : చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు 
వేడుకను ఆర్భాటంగా చేస్తారు. మీ ఆతిథ్యం బంధుమిత్రులకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆశించిన పదవులు దక్కవు. ఏది జరిగినా ఒకందుకు మంచిదే. సమర్ధతకు నిదానంగా గుర్తింపు లభిస్తుంది. ఆదివారం నాడు పనులు మందకొడిగా సాగుతాయి. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. సంతానం కదలికలపై దృష్టి సారించండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. పత్రాల రెన్యువల్‌లో మెలకువ వహించండి. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఉమ్మడి వ్యాపారాలకు అనుకూలం. కాంట్రాక్టర్లు, కార్మికులకు పనులు లభిస్తాయి. ఉపాధ్యాయులకు స్థానచలనం. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వాహన చోదకులకు దూకుడు తగదు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదము. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు 
అన్ని రంగాల వారికీ ఆశాజనకమే. ప్రేమానుబంధాలు బలపడతాయి. వ్యతిరేకులను సైతం ఆకట్టుకుంటారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనులు చురుకుగా సాగుతాయి. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. దాంపత్య సౌఖ్యం పొందుతారు. మంగళ, బుధవారాల్లో నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. ప్రలోభాలు, మొహమ్మాటాలకు పోవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. వ్యాపారాభివృద్ధికి మరింతగా శ్రమించాలి. మీ పథకాలు మునుముందు సత్ఫలితాలిస్తాయి. అధికారులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. సేవా, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము 
కార్యం సిద్ధిస్తుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఖర్చులు విపరీతం. పొదుపు ధనం గ్రహిస్తారు. పనులు వేగవంతమవుతాయి. గురు, శుక్రవారాల్లో మీ పెద్దరికానికి భంగం కలిగే సంఘటనలెదురవుతాయి. వాగ్వాదాలకు దిగవద్దు. సామరస్యంగా మెలగండి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. గృహ మరమ్మతులు చేపడతారు. ఒక ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. పత్రాలు అందుకుంటారు. స్థిరాస్తి క్రయ విక్రయాలకు అనుకూలం. దళారులతో జాగ్రత్త. మీ అభిప్రాయాలను ఖచ్చితంగా ఇజీతెలియజేయండి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. యోగా, ఆరోగ్య విషయాల పట్ల ఆసక్తి పెంపొందుతుంది. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు 
కృషి ఫలించకున్నా యత్నించామన్న సంతృప్తి ఉంటుంది. ఓర్పుతో వ్యవహరించండి. అవకాశాలు చేజారినా ఒకందుకు మంచిదే. త్వరలో శుభవార్తలు వింటారు. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. శనివారం నాడు పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. సంతానం ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. విశ్రాంతి అవసరం. పాత పరిచయస్తులు తారసపడతారు. గత అనుభవాలు అనుభూతి కలిగిస్తాయి. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. అధికారులతో సమస్యలెదురయ్యే సూచనలున్నాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. నూతన వ్యాపారాలకు సమయం కాదు. చేతివృత్తులు, కార్మికులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. 
 
కుంభం : ధనిష్ఠ 3, 4 పాదములు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదములు 
రుణ దాతల ఒత్తిళ్లు మనశ్శాంతి లేకుండా చేస్తాయి. ఆప్తుల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. మానసికంగా కుదుటపడతారు. ఆది, సోమవారాల్లో పనులు సాగవు. మీ వ్యాఖ్యలను కొంతమంది తప్పుగా భావిస్తారు. మీపై శకునాల ప్రభావం అధికం. విమర్శలు పట్టించుకోవద్దు. ఖర్చులు అధికం. అవసరాలు వాయిదా వేసుకుంటారు. సంతానం మొండితనం అసహనం కలిగిస్తుంది. సామరస్యంగా మెలగండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. పత్రాల రెన్యువల్‌లో అలక్ష్యం తగదు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. విద్యార్థులకు ఒత్తిడి అధికం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. వేడుకకు హాజరవుతారు. బంధువుల ఆతిధ్యం ఆకట్టుకుంటుంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు.
 
మీనం : సూర్వాకార 4వ పాదము, ఉత్తరాదార, నేను 1, 2, 3, 4 పాదములు 
వ్యవహారాలతో తీరిక ఉండదు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. బుధ, గురువారాల్లో ముఖ్యుల కలయిక వీలపడదు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఖర్చులు విపరీతం. ధన సమస్యలదురవుతాయి. సాయం అర్థంచేందుకు మనస్కరించదు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. మధ్యవర్తులను ఆశ్రయించవద్దు. ఒక సంబంధం కలిసివచ్చే సూచనలున్నాయి. జాతక పొంతన ప్రధానం. గృహంలో మార్పు చేర్పులకు అనుకూలం. పొగొట్టుకున్న పత్రాలు తిరిగి సంపాదిస్తారు. సోదరుల మధ్య అవగాహన నెలకొంటుంది. వ్యాపారాల్లో ఒడుదుడుకులను అధిగమిస్తారు. చిరు వ్యాపారులకు ఆశాజనకం. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎవరికి ఏది ఎంత ప్రాప్తం అని దైవం నిర్ణయిస్తే...