Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రూ.1.5 కోట్ల లావాదేవీలు.. కన్నకొడుకుపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన తండ్రి

Advertiesment
Bangolore
, శుక్రవారం, 8 ఏప్రియల్ 2022 (13:03 IST)
Bangolore
దేశంలో నేరాల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా బెంగళూరులో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. వ్యాపారంలో రూ.1.5 కోట్ల లావాదేవీల వివరాలను తనకు చెప్పలేదన్న కోపంతో ఓ తండ్రి కుమారుడిపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టాడు. తండ్రి సురేంద్ర నడిరోడ్డుపై కుమారుడు అర్పిత్‌పై పెట్రోల్ పోసి నిప్పుపెట్టాడు.
 
మంటల్లో కాలుతూ అర్పిత్ రోడ్డుపై పరుగులు తీశాడు. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. స్థానికులు మంటలను ఆర్పి అర్పిత్‌ను ఆస్పత్రికి తరలించారు. 
 
అయితే చికిత్స పొందుతూ అతను మరణించాడు. దీంతో తండ్రి సురేంద్రను పోలీసులు అరెస్టు చేశారు. ఆర్థిక లావాదేవీలో ఈ హత్యకు కారణమై వుంటాయని పోలీసులు చెప్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మనసు మార్చుకున్న సీఎం జగన్ - ఆ పది మందికి మళ్లీ ఛాన్స్