Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెట్రోల్ ధరలే కాదు.. సీఎన్‌జీ, పీఎన్‌జీ రేట్లు కూడా పెరిగాయ్

Webdunia
బుధవారం, 13 అక్టోబరు 2021 (13:07 IST)
CNG
దసరా పండుగ సీజన్‌లో గ్యాస్‌కు ఏర్పడిన డిమాండ్‌ను ప్రైవేటు కంపెనీలు క్యాష్ చేసుకుంటున్నాయి. పది రోజుల వ్యవధిలోనే రెండోసారి గృహ, రవాణాకు వాడే గ్యాస్ ధరలను పెంచేశాయి. దేశ రాజధాని ఢిల్లీ, చుట్టుపక్కల నగరాల్లో వాహనాల్లో నింపే సీఎన్‌జీ ధరతోపాటు పైపుల ద్వారా గృహాలకు చేరే గ్యాస్ పీఎన్‌జీ రేటు భారం ఇంకొంత పెరిగింది. గ్యాస్ డిస్ట్రిబ్యూషన్‌లో అగ్రగామిగా ఉంటూ, దేశ రాజధాని ఢిల్లీ, చుట్టుపక్కల మెట్రోల్లో మెజార్టీ వాటాదారైన ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ ఈ మేరకు కీలక ప్రకటన చేసింది..
 
దేశ రాజధాని ఢిల్లీతోపాటు పలు నగరాల్లో సీఎన్‌జీ, పీఎన్‌జీ ధరలు పెంచామని, బుధవారం (అక్టోబర్ 13) ఉదయం నుంచి పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయని ఐజీఎల్ తెలిపింది. సీఎన్‌జీపై ఒక కిలోకు రూ .2.28 , సీఎన్‌జీపై క్యూబిక్ మీటరుకు రూ.2.10 పెంచారు.
 
సవరణ తర్వాత ఢిల్లీలో సీఎన్‌జీ గ్యాస్ ధర కిలోకు 49.76లు ఉంది. నోయిడాలో కిలో రూ.56.02, గురుగ్రామ్‌లో రూ.58.20, రేవారి రూ.58.90, కైతల్ రూ.57.10, ముజఫర్‌నగర్, మీరట్, షామ్లీ రూ.63.28, ఫతేపూర్, హమీర్‌పూర్ రూ.66.54, అజ్మీర్, పాలి, రాజసమంద్ కిలోకు రూ. 65.02గా ఉంది. పైప్ లైన్ ద్వారా సరఫరా చేసే గ్యాస్ సీఎన్‌జీ ధరను క్యూబిక్ మీటరుపై రూ.2.10 పెరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pushpa 2 OTT: పుష్ప 2 ది రూల్ ఓటీటీలోకి ఎప్పుడొస్తుంది..?

నోయల్ బాణీతో రాహుల్ సిప్లిగంజ్ పాట తెలుగోడి బీట్ట్ సాంగ్

తమన్నా భాటియా ఓదెల 2 నుంచి తమన్నా టెర్రిఫిక్ లుక్ రిలీజ్

Pushpa-2- పుష్ప-2: 100 సంవత్సరాల హిందీ సినిమా చరిత్రలో కొత్త మైలురాయి

బిగ్ బాస్ కంటే జైలు బెటర్ అంటున్న నటి కస్తూరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

తర్వాతి కథనం
Show comments