ఐపీఎల్ 2021లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్‌ల మధ్య ఆదివారం తొలి క్వాలిఫయర్ మ్యాచ్ దుబాయ్ వేదికగా జరుగనుంది. ఇక, ఈ మెగా ఫైట్‌లో ఇరుజట్లలో క్షణాల్లో ఆటను మార్చగల దమ్మున్న ఆటగాళ్లు ఉన్నారు. ఈ సంవత్సరం ఐపీఎల్ సీజన్ ముగింపుకు వచ్చేసింది. విజేత ఎవరో తెలుసుకోవడానికి కేవలం నాలుగు మ్యాచ్‌ల దూరం మాత్రమే ఉంది.
ఐపీఎల్ రెండో దశ ప్రారంభం అయిన దగ్గరనుంచి ఢిల్లీ క్యాపిటల్స్ ఆరు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు సాధించింది. వారి బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ టాప్ల నాచ్‌లో ఉన్నాయి. అయితే ఆర్సీబీతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో మాత్రం ఆఖరి బంతికి ఓటమి పాలైంది.
యూఏఈలో ఐపీఎల్ ప్రారంభం అయ్యాక చెన్నై తన మొదటి నాలుగు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించింది. అయితే తర్వాత మూడు మ్యాచ్‌ల్లో మాత్రం పరాజయాలు పలకరించాయి. ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ చెన్నై మొదట బ్యాటింగ్ చేసి లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. ఈ మ్యాచ్‌లో బలంగా ఉన్న ఢిల్లీ మీద విజయం సాధించాలంటే.. చెన్నై సర్వశక్తులూ ఒడ్డాల్సిందే.
చెన్నై సూపర్ కింగ్స్ తుదిజట్టు(అంచనా)
ఫాఫ్ డుఫ్లెసిస్, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, అంబటి రాయుడు, సురేష్ రైనా/రాబిన్ ఉతప్ప, ఎంఎస్ ధోని(కెప్టెన్, వికెట్‌కీపర్), రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రేవో, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, జోష్ హజిల్‌వుడ్
ఢిల్లీ క్యాపిటల్స్ తుదిజట్టు(అంచనా)
పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్(కెప్టెన్, వికెట్ కీపర్), రిపల్ పటేల్, షిమ్రన్ హెట్‌మేయర్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కగిసో రబడ, అవేష్ ఖాన్, ఆన్రిచ్ నోర్జే.