Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 10 April 2025
webdunia

కృష్ణప్ప.. ఎంత పనిచేశావప్పా.. క్యాచ్‌ను వదిలేశావ్ కదప్పా..

Advertiesment
DC vs CSK
, మంగళవారం, 5 అక్టోబరు 2021 (13:38 IST)
krishnappa
దుబాయ్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ - ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒకే ఒక క్యాచ్ ఆటనే మార్చేసింది. అప్పటివరకు కాస్త చెన్నై వైపు ఉన్న మ్యాచ్.. ఏకంగా ఢిల్లీ వైపు మళ్లింది. అందుకే క్రికెట్ నిపుణులు 'క్యాచెస్ విన్ ది మ్యాచెస్' అని చెబుతుంటారు. ఢిల్లీ బ్యాటర్ షిమ్రోన్ హెట్‌మెయర్ కొట్టిన భారీ షాట్‌ను బౌండరీ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న కృష్ణప్ప గౌతమ్ జారవిడిచాడు. 
 
అది పెద్ద కష్టమైన క్యాచ్ కూడా కాదు. గతంతో బౌండరీ లైన్ వద్ద ఎన్నో కష్టమైన క్యాచ్‌లు తీసుకున్న అనుభవం కృష్ణప్ప గౌతమ్‌కు ఉంది. కానీ ఆ సమయంలో మాత్రం బంతిని సరిగా అంచనా వేయలేక జారవిడిచాడు. చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌లో డ్వేన్ బ్రావో చాలా కీలకమైన ఆల్‌రౌండర్. 
 
గత కొన్ని సీజన్లుగా డెత్ వోవర్లలో ధోనికి నమ్మకమైన ఆల్‌రౌండర్‌గా ఉంటూ కీలక వికెట్లు తీసి విజయాలను అందించాడు. దీంతో సోమవారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో కూడా బ్రావోను 18వ ఓవర్‌లో బౌలింగ్‌కు తీసుకొని వచ్చాడు.
 
బ్రావో బంతి అందుకునే సమయానికి స్ట్రైకింగ్ ఎండ్‌లో తమ దేశానికే చెందిన షిమ్రోన్ హెట్‌మెయర్ ఉన్నాడు. ఇద్దరూ గత కొంత కాలంగా కలసి క్రికెట్ ఆడుతున్నారు కాబట్టి ఒకరి లోపాలు మరొకరికి తెలుసు. హెట్‌మెయర్ కంటే సీనియర్ అయిన బ్రావో అతడికి ఎలాంటి బంతి వేస్తే దొరికిపోతాడో తెలిసే బంతి విసిరాడు. అనుకున్నట్లుగానే హెట్‌మెయర్ మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్ ఆడాడు. 
 
బంతి సరిగ్గా కృష్ణప్ప గౌతమ్ ఉన్న వైపే వెళ్లింది. కానీ బంతిని అందుకోలేక జారవిడవడంతో హెట్‌మెయర్ బతికి పోయాడు. అంతే కాకుండా ఆ బాల్ బౌండరీకి తగిలి నాలుగు పరుగులు కూడా వచ్చాయి. అక్కడి నుంచి మ్యాచ్ వేగం మారిపోయింది. హెట్‌మెయర్ వరుసగా బౌండరీలు కొడుతూ మ్యాచ్‌ను ఢిల్లీవైపు తిప్పేశాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ధోనీ సేన ఓటమి : అగ్రస్థానంలో ఢిల్లీ