Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాపిస్తోంది... : డీజీపీ గౌతం సవాంగ్

Advertiesment
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాపిస్తోంది... : డీజీపీ గౌతం సవాంగ్
, సోమవారం, 29 మార్చి 2021 (12:47 IST)
ఏపీలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోందని డీజీపీ గౌతం సవాంగ్ హెచ్చరించారు. అందువల్ల ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని కోరారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, కరోనా కేసుల దృష్ట్యా ప్రజలు స్వీయ జాగ్రత్తలు పాటించాలన్నారు. కరోనా వ్యాప్తి కట్టడికి పోలీసు శాఖకు సహకరించాలని.. కోవిడ్ నిబంధనలు పాటించకపోతే భారీగా జరిమానాలు విధించక తప్పదన్నారు. 
 
అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయొద్ధన్నారు. ఫంక్షన్స్, పార్టీలు వీలైతే వాయిదా వేసుకోవాలని సూచించారు.మాస్క్, భౌతికదూరం, శానిటైజర్ వాడటం అలవాటుగా మార్చుకోవాలన్నారు. స్కూల్స్, కాలేజీల్లో భౌతికదూరం ఉండేలా చర్యలు తీసుకోవాలని డీజీపీ సూచించారు.
 
ముఖ్యంగా, ప్రజలందరూ స్వీయ జాగ్రతలు పాటించాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని ఆయన హితవుపలికారు. అత్యవసర సందర్భాలలో మాత్రమే బయటకు రావాలన్నారు. ఫంక్షన్స్‌ను తక్కువ మందితో జరుపుకోవాలని లేదా వాయిదా వేసుకోవాలని సవాంగ్‌ సూచించారు.
 
"రాష్ట్రంలో  కొవిడ్‌ మహమ్మారి కమ్ముకొస్తోంది. పల్లె, పట్నం తేడా లేకుండా వైరస్‌ శరవేగంగా వ్యాపిస్తోంది. ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారి ద్వారా కాంటాక్ట్స్‌ పెరిగి పాజిటివ్‌లు ఎక్కువైపోతున్నాయి. దీంతో జిల్లాలో రోజురోజుకూ కేసుల సంఖ్య అంతకంతకూ రెట్టింపవుతోంది. 
 
రాష్ట్రంలో కరోనా మళ్లీ విజృంభిస్తుండటంతో పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. శనివారం నుంచి రోడ్లపైకి వచ్చిన పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా మాస్క్‌లు లేనివారికి జరిమానాలు విధించడం ప్రారంభించారు. మొదటిసారి పట్టుబడితే రూ.250, రెండోసారి రూ.500 తప్పదని" ఆయన హెచ్చరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీఎస్‌గా 3- 4 నెలలే ఉన్నా.. ఎలా అవినీతికి పాల్పడగలను? : రత్నప్రభ