Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటర్నేషనల్ ఏవియేషన్ విద్యను ప్రవేశపెట్టిన "చెన్నై అమృత" విద్యా సంస్థ.

ఠాగూర్
బుధవారం, 29 మే 2024 (18:02 IST)
ఈ విద్యా సంవత్సరం నుండి "చెన్నై అమృత" కళాశాలలో నూతనంగా ఇంటర్నేషనల్ ఏవియేషన్ సర్టిఫికెట్, డిప్లమా, డిగ్రీ కోర్సులను భోధించనునట్లు ఆ సంస్థ చైర్మన్ ఆర్.భూమినాథన్ ప్రకటించారు. ఇందుకోసం మలేషియాకు చెందిన ప్రముఖ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఏవియేషన్ మేనేజమెంట్‌తో ఈనెల 17న చెన్నైలో ఇరు సంస్థల సభ్యుల సమక్షంలో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసుకున్నామని తెలియచేశారు. తాజాగా హైదరాబాద్ హోటల్ గ్రీన్ పార్క్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించారు.
 
ఈ సందర్భగా "చెన్నై అమృత" గ్రూప్ చైర్మన్ భూమినాథన్ మాట్లాడుతూ, గత పద్నాలుగు సవత్సరాలుగా చెన్నై ప్రధాన కేంద్రంగా బెంగళూరు, హైద్రాబాద్, ఖైరతాబాద్, విజయవాడల్లో ఉన్న మా కాలేజీలో వేలాది మంది విద్యార్థులకు అత్యంత నాణ్యతా ప్రమాణాలతో కూడిన హోటల్ మేనేజ్మెంట్, హాస్పిటాలిటీ కోర్సులను బోధిస్తున్నామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఘడియ ఘడియకు సాంకేతిక ఆవిష్కరణలతో అత్యంత వేగంగా ప్రపంచం నింగిలోకి దూసుకెళుతింటే మేమూ మా విద్యార్థులకు వైమానికి రంగ విద్యను కూడా ఈ సంత్సరం నుండి ప్రవేశ పెట్టామన్నారు.
 
అందుకోసం అంతర్జాతీయ స్థాయిలో ఉన్నత విలులతో అత్యంత ఆధునిక ప్రమాణాలతో కలిగిన మలేషియాకు చెందిన ప్రముఖ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఏవియేషన్ మేనేజమెంట్ కళాశాలతోనూ, హాస్పిటాలిటీ అండ్ హోటల్ మేనేజ్మెంట్ విద్యను అందిస్తున్న సింగపూర్‌కు చెందిన బిర్మింగ్ హామ్ అకాడమీతో భాగస్వామ్య ఒప్పదం కుదుర్చుకున్నట్టు భూమినాథన్ తెలిపారు. ఈ ఒప్పందాల ద్వారా మా కళాశాలలో చదివే విద్యార్థులు విద్యాభ్యాసంతో పాటు అనుభవపూర్వక అభ్యాసం పొందుతూ ప్రతి నెలా తగిన పారితోషకాన్ని పొందుతారు. 
 
మా చెన్నై అమృతి కళాశాల ప్రారంభించిన నాటి నుండి ఈ పద్నాలుగేళ్లలో హాస్పిటాలిటీ, హోటల్‌మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ, డిప్లొమా పూర్తి చేసిన వేలాది మంది విద్యార్థులు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాల్లో అనేక సంస్థల్లో వివిధ హోదాల్లో ఉద్యోగాలు చేస్తున్నారని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్యరంగం , టూరిజం బాగా విస్తరిస్తోంది, దానితో విమానయానం మరింత పోటీగా కొత్తగా రూపుదిద్దుకుంటున్నాయి. ఆ దిశగా ఉపాధి అవకాశాలు బహు మెండుగా ఉన్నాయి. అందుకే మా అకాడెమీలో హోటల్ మేనేజ్మెంట్ మరియు హాస్పిటాలిటీ‌తో పాటు ఈ సంవత్సరం నుండి ఏవియేషన్ విద్యను ప్రవేశ పెట్టాము. 
 
మూడు దేశాల్లో చదవడం అనేది కోర్స్‌లోని ప్రధాన అంశం. ఆరు నెలల పాటు బర్మింగ్‌హామ్ అకాడమీ నుండి డిప్లొమాతో కోర్సును ఇంటర్న్‌షిప్ పొందుతూ చెన్నైస్ అమృతలో మొదటి సంవత్సరంలో చదువుకోవచ్చు. ఆరు నెలల పాటు అడ్వాన్స్‌డ్ డిప్లొమాతో బర్మింగ్‌హామ్ అకాడమీలో సింగపూర్‌లో ఉండి రెండో సంవత్సరంలో చదువుకోవచ్చు. ఆరు నెలల పాటు ఇంటర్న్‌షిప్ అందించబడుతుంది. నెలకు ఎస్జీడీ 1,500 వరకు సంపాదించవచ్చు. సుమారు భారత కరెన్సీలో లక్ష వరకు సంపాదించవచ్చు. 
 
విద్యార్థి యూకేలోని డి మోంట్‌ఫోర్ట్ విశ్వవిద్యాలయంలో ఒక సంవత్సరం పాటు డిగ్రీ ప్రోగ్రామ్‌లో చేరవచ్చు అక్కడ విద్యార్థి ఆరు నెలలు చదువుతారు మరియు యూకేలో ఆరు నెలల ఇంటర్న్‌షిప్ ద్వారా పని అనుభవాన్ని పొందుతారు. మరియు నెలకు 2,000 డాలర్ల వరకు సంపాదిస్తారు. మన దేశీయ రూపాయల్లో సుమారు నెలకు రెండు లక్షలు. మూడేళ్ల కోర్సు పూర్తి అయ్యాక అత్యంత అర్హత కలిగిన గ్రాడ్యుయేట్‌ నిపుణులుగా సిద్ధమై వస్తారని తెలిపారు. 
 
అనంతరం హైదరాబాద్ మేరిగోల్డ్ అండ్ గ్రీన్ పార్క్ హోటల్స్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆపరేషన్స్ఆర్ రాజేష్ గోపాలకృష్ణన్ మాట్లాడుతూ జర్మనీలో జరిగిన 2024 ఏకేఏ కలినరీ ఒలింపిక్స్‌లో చెన్నైస్ అమృత విద్యార్థులు 3 స్వర్ణాలు, 6 రజతాలు, ఒక కాంస్య పతకాలను సాధించారని, గత 124 సంవత్సరాల నుండి జరుగున్న ఈ వంటల పోటీల చరిత్రలో భారతదేశానికి చారిత్రాత్మకంగా మొదటి స్థానంలో నిలిపింది మన చెన్నై అమృత విద్యార్థులే అని కొనియాడారు. 
 
ఈ మధ్య యూఏఈలోని షార్జాలో జరిగిన ఎమిరేట్స్ ఇంటర్నేషనల్ సలోన్ కలినరీలో 2 బంగారు, 1 రజత మరియు 6 కాంస్య పతకాలను సాధించడం ద్వారా మరోసారి చరిత్ర సృష్టించారు, ఇక్కడ వారి రుచులను సుమారు ఇరవై జ్యూరీల ముందు ప్రదర్శించబడ్డాయి. 27 ఏళ్ల ఎమిరేట్స్ ఇంటర్నేషనల్ సలోన్ క్యూలినేర్ చరిత్రలో భారత్ తొలిసారిగా ఈ బంగారు పతకాన్ని గెలుచుకుందిని తెలిపారు. 
 
ఈ సమావేశంలో చెన్నై అమృత గ్రూప్‌ ఆఫ్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌కు చెందిన సీఈవో కవితా నందకుమార్, సీఏడీ లియో ప్రసాద్, డీన్ డా.టి.మిల్టన్, కళాశాల అడ్మినిస్ట్రేటర్ కుమారి భానుమతి, హైదరాబాద్ క్యాంపస్ ప్రిన్సిపాల్ తామర కొలను చంద్ర మోహన్, తదితరులు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Renu Desai: కాశీలో సాధువును కలిసిన రేణు దేశాయ్.. విశ్వాసం మేలు చేస్తుంది.. (video)

విజయ్ సేతుపతి రిలీజ్ చేసిన యాక్షన్ మూవీ కోర టీజర్

రిట‌ర్న్ ఆఫ్ ది డ్రాగ‌న్‌ లోని సాంగ్ కు డాన్స్ చేసిన గౌతమ్ వాసుదేవ మీనన్

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర టెక్నికల్ టీమ్ మార్పు !

ఇన్ని కండోమ్‌లైతే కన్యలు దొరకడం కష్టమే, ఐతే మేకలు, కుక్కలతో శృంగారం కోసం కొనండి: చిన్మయి ఘాటు రిప్లై

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

న్యూరోఫార్మకాలజీ, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్‌లో కెఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలు

Women Teachers Day: సావిత్రీబాయి ఫూలే జయంతి- మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం

కోడి గుడ్లు, పాలు ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments