శామ్‌సంగ్ సోమవారం భారతదేశంలో 50ఎంపీ కెమెరాతో తన గ్యాలెక్సీ ఎఫ్ సిరీస్, గ్యాలెక్సీ ఎఫ్ 55 5జీ పేరిట కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. గ్యాలెక్సీ ఎఫ్ 55 5జీ మూడు స్టోరేజ్ వేరియంట్‌లలో లభిస్తుంది.
8GB+128GB, 8GB+256GB, 12GB+256GBలలో ఫ్లిఫ్ కార్ట్, శాంసంగ్ వెబ్ సైట్లలో లభిస్తాయి. అలాగే ఎంపిక చేసిన రిటైల్ స్టోర్‌లలో ప్రారంభ ధర రూ. 26,999. ఈ ఫోన్ రెండు రంగుల్లో మార్కెట్లో లభిస్తుంది. ఆప్రికాట్ క్రష్, రైసిన్ బ్లాక్‌లలో ఈ ఫోన్ లభిస్తుంది.
గ్యాలెక్సీ ఎఫ్ 55 5జీతో, శాంసంగ్ ఎఫ్ సిరీస్‌లో మొట్టమొదటిసారిగా జీను స్టిచ్‌తో క్లాసీ వేగన్ లెదర్ డిజైన్‌ను అందిస్తోంది. శాడిల్ స్టిచ్ ప్యాటర్న్‌తో కూడిన క్లాసీ వేగన్ లెదర్ బ్యాక్ ప్యానెల్, బంగారు రంగులో ఇది లభిస్తుంది.