Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో - ఎయిర్‌టెల్‌కు షాకిస్తూ బీఎస్ఎన్ఎల్ అదిరిపోయే ప్లాన్...

ఠాగూర్
సోమవారం, 16 సెప్టెంబరు 2024 (16:45 IST)
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ అదిరిపోయే ప్లాన్‌ను ప్రకటించింది. ప్రైవేట్ టెలికాం సంస్థలు ఎయిర్ టెల్, రిలయన్స్ జియోలకు కూడా సాధ్యం కాని ప్లాన్‌ను ప్రకటించింది. 54 రోజుల కాలపరిమితితో 165 జీపీ డేటాతో ఈ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్ ధర రూ.347. 
 
ఇటీవల జియో, ఎయిర్‌టెల్ కంపెనీలు తమ వివిధ ప్లాన్ల టారిఫ్ రేట్లను ఇష్టానుసారంగా పెంచిన విషయం తెల్సిందే. దీంతో అనేక మంది వినియోగదారులు బీఎస్ఎన్ఎల్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో బీఎస్ఎన్ఎల్ కూడా ఆకర్షణీయమైన ప్లాన్లను ప్రకటిస్తుంది. 
 
తాజాగా జియో, ఎయిర్‌టెల్‌కు పోటీగా బీఎస్ఎన్ఎల్ ఈ ఆకర్షణీయమైన ప్లాన్‌ను ప్రకటించింది. రూ.347తో ప్రకటించిన ఈ ప్లాన్‌లో యూజర్లకు 54 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇంత తక్కువ ధరతో ఇలాంటి ప్లాన్‌ను ఏ ఒక్క టెలికాం కంపెనీ కూడా ప్రకటించకపోవడం గమనార్హం. 
 
ఈ ప్లాన్‌ను ఎంచుకునేవారు 54 రోజుల కాలపరిమితితో పాటు 100 ఎస్ఎంఎస్‌లు, రోజుకు 3జీబీ డేటాతో పాటు అదనంగా 3 జీబీ డేటాతో కలిపి మొత్తంగా 165 జీపీ డేటా లభిస్తుంది. దీనికి అదనంగా హార్డీ గేమ్స్, చాలెంజర్, ఎరీనా గేమ్స్, గేమాన్, ఆస్ట్రోటెల్, గేమియం, జంగ్ మ్యూజిక్, వాన్ ఎంటర్‌టైన్మెంట్, బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్, లిస్టిన్ పాడ్ కాస్ట్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. మరోవైపు, బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ వినియోగదారులకు త్వరలోనే సూపర్ ఫాస్ట కనెక్టివిటీ 4జీ అందుబాటులోకి రానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments