Publish Date: Wed, 04 Sep 2024 (14:30 IST)
Updated Date: Wed, 04 Sep 2024 (15:25 IST)
టెలికం దిగ్గజం రిలయన్స్ జియో కొత్త వ్యాల్యూ యాడెడ్ రీఛార్జ్ ప్లాన్లను ప్రకటించింది. అపరిమిత కాలింగ్, డేటా వంటి ప్రయోజనాలను అందించే ఆఫర్లను జియో ఆవిష్కరించింది.
సాధారణంగా కాలింగ్, డేటా బెనిఫిట్స్ అందించే ప్లాన్స్ రేట్లు కనీసం రూ.180 నుంచి రూ.200 మధ్య ఉంటాయి. అయితే నెలకు రూ.173 మాత్రమే వెచ్చించేలా రూ.1,889 ప్లాన్‌ను జియో పరిచయం చేసింది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 336 రోజులుగా ఉంది.
ఈ ప్లాన్‌లో కస్టమర్లు దేశంలో ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాలింగ్ చేసుకోవచ్చు. ఉచిత జాతీయ రోమింగ్, 3600 ఉచిత మెసేజులు, జియో అనుబంధ యాప్‌ల యాక్సెస్‌తో పాటు అదనంగా 24 జీబీల హైస్పీడ్ డేటా కూడా లభిస్తుంది. నెలవారీ ప్లాన్‌ను పొందాలనుకుంటే రూ. 189 రీఛార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది.