Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుడ్‌న్యూస్: సిలిండర్‌ను మీకు నచ్చిన డిస్ట్రిబ్యూటర్‌ మార్చుకోవచ్చు..!

Webdunia
బుధవారం, 8 సెప్టెంబరు 2021 (17:22 IST)
మీరు గ్యాస్ సిలిండర్ ఉపయోగిస్తున్నారా? అయితే మీకు గుడ్‌న్యూస్‌. కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. దీంతో ఎల్‌పీజీ సిలిండర్ వాడే వారికి ఊరట కలుగనుంది. కొత్త రూల్స్ ప్రకారం.. మీకు నచ్చిన గ్యాస్ సిలిండర్ డిస్ట్రిబ్యూటర్‌కు మీరు మారవచ్చు. దీంతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కొంత మంది సిలిండర్ బుక్ చేసి చాలా రోజులు అయినా కూడా సిలిండర్ ఇంటికి రాదు. 
 
ఇలాంటి వారు ఇకపై ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. వారి గ్యాస్ డిస్ట్రిబ్యూటర్‌ను మార్చుకోవచ్చు. వేరే డిస్ట్రిబ్యూటర్ నుంచి సిలిండర్ పొందే వెసులుబాటు ఉంటుంది. ఇలా నచ్చిన డిస్ట్రిబ్యూటర్ నుంచి సిలిండర్ పొందే అవకాశం అందుబాటులోకి వచ్చింది.
 
ఈ విషయాన్ని ఇండియన్ ఆయిల్ తాజాగా ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. మీకు నచ్చిన డిస్ట్రిబ్యూటర్ నుంచి గ్యాస్ సిలిండర్ పొందవచ్చని తెలిపింది. మీ డిస్ట్రిబ్యూటర్‌ను ఎంపిక చేసుకొని గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చని పేర్కొంది. ఇండియన్ ఆయిల్ వన్ యాప్ ద్వారా సులభంగా సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. వినియోగదారులకు మరిన్ని సదుపాయాలు అందించేందుకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఈ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments