Webdunia - Bharat's app for daily news and videos

Install App

మారుతీ సుజుకీ కొత్త స్విఫ్ట్, డిజైర్ కార్లను రీకాల్ చేసింది... ఎందుకు?

మారుతి సుజుకి సరికొత్త మోడళ్ల కార్లను మార్కెట్‌లో ప్రవేశపెడుతూ ఆటోమొబైల్ రంగంలో రారాజుగా దూసుకుపోతోంది. మారుతి సుజుకి తీసుకొచ్చిన స్విఫ్ట్, డిజైర్ ఎంతగానో ఆదరణ పొందాయి. తాజాగా ఈ మోడల్‌లో మరికొన్ని మార్పులను చేసి కొత్త జనరేషన్ స్విఫ్ట్ మరియు స్విఫ్ట్

Webdunia
బుధవారం, 25 జులై 2018 (17:16 IST)
మారుతి సుజుకి సరికొత్త మోడళ్ల కార్లను మార్కెట్‌లో ప్రవేశపెడుతూ ఆటోమొబైల్ రంగంలో రారాజుగా దూసుకుపోతోంది. మారుతి సుజుకి తీసుకొచ్చిన స్విఫ్ట్, డిజైర్ ఎంతగానో ఆదరణ పొందాయి. తాజాగా ఈ మోడల్‌లో మరికొన్ని మార్పులను చేసి కొత్త జనరేషన్ స్విఫ్ట్ మరియు స్విఫ్ట్ డిజైర్ కార్లను తీసుకొచ్చారు. ఈ మోడల్ కార్లు లుక్ పరంగా ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. 
 
అయితే ఆ సంస్థ తాజాగా భారీ ఎత్తున కార్లను రీకాల్ చేస్తోంది. ఎయిర్ బ్యాగ్స్‌లో లోపాల కారణంగా ఈ కార్లను వెనక్కి తీసుకోనున్నట్లు ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే అందులో మే 7వ తేదీ నుండి జూలై 5వ తేదీ 2018 మధ్య ఉత్పత్తి అయిన కార్లను మాత్రమే పరీక్షిస్తున్నట్లు పేర్కొంది. అంతేకాదు ఈ రీకాల్ జూలై 25వ తేదీ నుండి ప్రారంభం కానుందని ప్రకటించింది.
 
మొత్తం 566 స్విఫ్ట్, 713 డిజైర్ కార్లను వెనక్కి తీసుకోనున్నట్లు తెలిపింది. మారుతి సుజుకి డీలర్లే సంబంధిత వాహన యజమానులను సంప్రదిస్తారని, అలాగే సమస్య తలెత్తిన ఆయా భాగాలను సంస్థ తరపున ఉచితంగా అందిస్తామని, అంతేకాకుండా మరిన్ని వివరాల కోసం మారుతి సుజుకి అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవాల్సిందిగా కార్ల యజమానులను కంపెనీ కోరింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments