Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో గుబులు పుట్టిస్తున్న పెట్రోల్ ధర.. 2 జిల్లాల్లో ధర తగ్గింపు

Webdunia
శుక్రవారం, 4 జూన్ 2021 (15:14 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్రోల్ ధరలు గుబులు పుట్టిస్తున్నాయి. ఇప్పటికే రెండు జిల్లాలు మినహా మిగిలిన 11 జిల్లాల్లో లీటర్ పెట్రోల్ ధర సెంచరీని దాటేసింది. దీంతో వాహనచోదకులు వాహనం తీయాలంటే భయపడిపోతున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖ, కడప జిల్లాల్లో శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం స్వల్పంగా ధరను తగ్గించింది. విశాఖలో లీటర్‌పై రూ.19 పైసలు, కడపలో రూ.17 పైసలు తగ్గించడంతో ఈ రెండు జిల్లాల్లో లీటర్‌ ధర వందకు దిగువకు చేరింది.
 
అలాగే, మిగిలిన జిల్లాల్లోని పెట్రోల్ ధరలను పరిశీలిస్తే, అనంతపురం జిల్లాలో లీటర్‌ పెట్రోల్‌ రూ.100.80 పైసలు, చిత్తూరులో రూ.101, తూర్పు గోదావరిలో రూ.100.23, పశ్చిమగోదావరిలో రూ.101.23, కృష్ణా జిల్లాలో రూ. 100.70పైసలుగా ఉంది. 
 
అదేవిధంగా గుంటూరులో రూ.100.89, కర్నూల్‌లో రూ.101.03, నెల్లూరులో రూ.100.30, విజయవాడలో రూ.100.89, ప్రకాశం జిల్లాలో రూ.100.67, శ్రీకాకుళంలో రూ.100.68, విజయనగరంలో రూ.100.04, విశాఖలో లీటర్‌ పెట్రోల్‌ రూ. 99.90, కడపలో లీటర్‌ ధర రూ.99.93గా ఉంది. 

అలాగే, దేశ రాజధాని ఢిల్లీలో రూ.94.76, ముంబైలో రూ.100.98, కోల్‌కతాలో రూ.94.76, చెన్నైలో రూ.96.23 పైసలు చొప్పున ఉంది. ఈ పెట్రోల్ ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నప్పటికీ కేంద్రం మాత్రం మీనమేషాలు లెక్కిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: అల్లు అర్జున్ అరెస్ట్.. పూనమ్ కౌర్ కామెంట్స్.. రాజకీయం అంటే?

విల్ స్మిత్‌తో $50 మిలియన్ మీడియా ఫండ్ కోసం విష్ణు మంచు చర్చలు

గేమ్ ఛేంజర్ లో దర్శకుడు శంకర్ పాత్ర చెప్పగానే వద్దకున్నా: శ్రీకాంత్

అల్లు అర్జున్ కలిసిన ఉపేంద్ర.. మంచి మనిషి అని కితాబు

Nidhi Agarwal: పవన్ గొప్ప మనసున్న వ్యక్తి... ఆయనతో కలిసి నటించడం అదృష్టం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

లెమన్ వాటర్ ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments