Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆంధ్రప్రదేశ్‌లో థర్డ్ వేవ్... హాట్‌స్పాట్‌గా ఆ రెండు జిల్లాలు

Advertiesment
Andhra Pradesh
, శుక్రవారం, 4 జూన్ 2021 (09:28 IST)
రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ బుసలు కొట్టింది. ఈ వైరస్ భయం ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. ఇంతలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్టర్రాల్లో థర్డ్ వేవ్ మొదలైనట్టు తెలుస్తోంది. ఈ దశలో చిన్నారుల‌కు ముప్పుగా ప‌రిణ‌మిస్తుంద‌నే ఆందోళ‌న‌ వ్యక్తమవుతోంది. గత రెండు వారాల్లోనే 23,920 మంది చిన్నారులకు ఈ వైరస్ సోకింది. వీరంతా 18 యేళ్ళలోపు వారే కావడం గమనార్హం. 
 
ఈ నేప‌థ్యంలో వైర‌స్ త‌న‌ స్వ‌భావం మార్చుకుంటే పిల్ల‌ల‌పై అధిక ప్ర‌భావం చూప‌వ‌చ్చినట్లుగా కనిపిస్తోంది. ఈ దశలో చిన్నారులపై వైరస్ తీవ్ర దుష్ప్రభావాలు చూపే అవకాశముందని అంతర్జాతీయ స్థాయిలో నిపుణులు హెచ్చరిస్తున్నారు.
 
అయితే ఈ ప్రభావం ఏపీలో తీవ్రంగా కనిపిస్తుంది. గత రెండు వారాల్లో ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 2.3 లక్షల కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. మే 18- 31 మధ్యలో 23,920 కేసులు 18 ఏళ్లలోపు పిల్లల్లో నమోదయ్యాయి. ఐదు సంత్సరాల లోపువారు కూడా ఇందులో ఉన్నారు. వారిలో 2,209 మంది పిల్లలు సంవత్సరాలు వైరస్ బారిన పడ్డారు.
 
ఈ సమయంలో రాష్ట్రంలోని ప్రధాన హాట్ స్పాట్ అయిన తూర్పు గోదావరిలో సుమారు 4,200 మంది చిన్నారు కోవిడ్ బారిన పడినట్లుగా వైద్యులు గుర్తించారు. మరో కోవిడ్ సెంటర్ చిత్తూరులో సమారు 3,800 మంది పిల్లలు కరోనా సోకినట్లుగా తెలుస్తోంది. అలాే 
 
మరోవైపు, తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. థర్డ్ వేవ్‌ ముప్పును ఎదుర్కోవడంపై దృష్టిసారించింది. రాష్ట్రంలో సుమారు 30 లక్షలమంది చిన్నారులు వైరస్‌ బారినపడే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తుండటంతో ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టింది. 
 
వీరిలో సుమారు 6000-8000 మంది వరకూ ఐసీయూలో చికిత్స పొందే అవకాశం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఇందులోనూ 1 శాతంమంది చిన్నారుల్లో ప్రమాదకరమైన ‘మల్టీ సిస్టం ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌ (MIS-C) అటాక్ కావచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
వాస్తవానికి తొలి, రెండు దశల్లో కరోనా వైరస్ చిన్నారులపై పెద్దగా ప్రభావం చూపించలేదు. అయితే.. రెండోదశలో మాత్రం ముప్పు కొద్దిగా కనిపించింది. గత ఏడాదిన్నరగా రాష్ట్రంలో తొలి, మలి దశల్లో మొత్తం 81,967 మంది పిల్లలు కరోనా వైరస్‌ బారినపడ్డారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

10 రూపాయల డాక్టర్: కరోనావైరస్ హాంఫట్, హైదరాబాదులో ఎక్కడో తెలుసా?