Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.800, రూ.900 నాణేలను ఎపుడైనా చూశారా?

ఠాగూర్
గురువారం, 13 మార్చి 2025 (10:51 IST)
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రూ.1, 2, 5, 10, 20 నాణేలు రోజువారీ చెలామణిలో ఉన్నాయి. కానీ, రూ.800, రూ.900 నాణేలను మీరు ఎక్కడా చూసివుండరు. ఎందుకంటే ఇవి దేశంలో ఎక్కడా చెలామణిలో లేవు. అయితే, ఈ నాణేలు ఎందుకు ముద్రించారన్నదే కదా మీ సందేహం. 
 
సాధారణంగా పలువురు ప్రముఖుల స్మృతి చిహ్నంగా ఆర్.బి.ఐ చాలా కొద్ది సంఖ్యలో ఇలాంటి నాణేలను ముద్రిస్తుంటుంది. ఇలా ముద్రించిన నాణేలను ప్రత్యేకంగా అమ్మకానికి పెడుతుంది. తాజాగా నెల్లూరు జిల్లా ఏఎస్ పేట గ్రామానికి చెందిన మహ్మద్ వాయిస్ రూ.800, రూ.900 నాణేలను తెప్పించుకున్నాడు. 
 
దేశంలో తొలిసారి విడుదలైన ఈ నాణేలను 2025, ఫిబ్రవరి 20వ తేదీన భారతీయ రిజర్వు బ్యాంకు ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టింది. ఈ విషయం తెలుసుకున్న వాయిస్ తక్షణం ఆర్డర్ చేయగా, మార్చి 10వ తేదీన అందాయని వెల్లడించారు. 
 
ఈ నాణేలను జైన తీర్థంకరుడు పార్శ్వనాథుడి జయంతి సందర్భంగా ఆర్.బి.ఐ ముంబై మింట్ ముద్రించింది. వెండితో తయారు చేసిన ఈ నాణేలు ఒక్కోటి 40 గ్రాముల బరువును కలిగివుంది. కాగా, కరెన్సీ సేకరించే హాబీ ఉన్న మహ్మద్ వాయిస్ వద్ద 170 దేశాలకు చెందిన నాణేలు, కరెన్సీ ఉన్నట్టు ఆయన వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments