ముంబైకు చెందిన సినీ నటి కాదంబరి జెత్వానీ అరెస్టు చేసి ఇబ్బందులు పెట్టిన వ్యవహారంలో ఏపీకి చెందిన ముగ్గురు ఐపీఎస్ అధికారులపై ప్రభుత్వం విధించిన సస్పెన్షన్‌ను మరో ఆరు నెలల పాటు పొడగిస్తూ, ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
జెత్వానీ వ్యవహారంలో ఏపీ నిఘా వర్గం మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ మాజీ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా, ఐపీఎస్ అధికారి విశాల్ గున్నిలు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. వీరిపై ఇప్పటికే సస్పెన్ష్ వేటుపడింది. ఈ సస్పెన్షన్ గడువు బుధవారంతో ముగియడంతో మరో ఆరు నెలలు అంటే వచ్చే సెప్టెంబరు 25వ తేదీ వరకు పొడగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులు అఖిల భారత సర్వీస్ నిబంధనలను ఉల్లఘించారనే అభియోగాలపై రివ్యూ కమిటీ సిఫారసు తర్వాత సస్పెన్షన్‌ను పొడగిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీచేశారు.