Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీడియా రంగంలో అదానీ అదుర్స్.. IANSలో 50-50

Webdunia
శనివారం, 16 డిశెంబరు 2023 (19:09 IST)
అదానీ గ్రూప్ ఛైర్మన్ ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ మీడియా రంగంలో రాణిస్తున్నారు. ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఐఎన్ఎస్‌లో సగానికిపైగా వాటా కొనుగోలు చేశారు. ఈ డీల్ విలువ ఎంత మొత్తం అనేది స్పష్టత లేదు. అదానీ గ్రూప్‌కు చెందిన ఏఎంజీ మీడియా నెట్‌వర్క్స్ లిమిటెడ్ ద్వారా 50.50 శాతం వాటా కొనుగోలు చేసినట్లు అదానీ గ్రూప్.. ఈ మేరకు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది.
 
అదానీ భారతదేశంలోని అగ్రశ్రేణి బిలియనీర్లలో ఒకరిగా వెలుగొందుతున్నారు. అంబానీ గ్రూప్‌కు వ్యతిరేకంగా, అదానీ గ్రూప్ గత 10 సంవత్సరాలలో విపరీతంగా అభివృద్ధి చెందింది. అన్ని రంగాలలో పట్టు సాధించింది. AMGతో మీడియా రంగంలో ఆధిపత్యం చెలాయించే అదానీ గ్రూప్ మీడియా నెట్‌వర్క్ లిమిటెడ్ పేరుతో కంపెనీని నడుపుతోంది.
 
కంపెనీ ఇప్పటికే భారతదేశ ప్రముఖ వార్తా సంస్థ ఎన్టీలో ఉంది. తాజాగా ఏఐఎన్ఎస్ న్యూస్ కంపెనీలో 50.50 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఈ ఏఐఎన్ఎస్ ద్వారా అదానీ గ్రూప్ వార్తా సంస్థలో కీలక ఎగ్జిక్యూటివ్‌లను నియమించడం నుండి తొలగించడం వరకు అన్ని కార్యకలాపాలను నిర్వహించగలదు.
 
ఈ కంపెనీ ఆదాయం 2021 ఆర్థిక సంవత్సరంలో రూ.10.3 కోట్లు, 2022 ఆర్థిక సంవత్సరంలో రూ. 9.4 కోట్లు, 2023 ఆర్థిక సంవత్సరంలో రూ.12 కోట్లుగా ఉన్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నటీనటులకు ప్రభుత్వం ఏమి చేయాలో చెప్పనవసరం లేదు- సిద్ధార్థ్

ప్రణీత్ హనుమంతుపై ఫైర్ అయిన సుధీర్ బాబు.. చీడపురుగు అంటూ?

ప్రభాస్‌తో సందీప్ రెడ్డి వంగా చిత్రం.. స్పిరిట్‌లో కొరియన్ యాక్టర్?

ఎరుపు రంగు ఎంబ్రాయిడరీ చీరలో బుట్టబొమ్మ

కమల్ హాసన్‌ వాయిస్‌తో అదరగొట్టిన హాస్యబ్రహ్మ... video

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పనస పండు ఆరోగ్య ప్రయోజనాలు

వెల్లుల్లి వాసన పడదా.. మహిళలు రెండు రెబ్బలు తింటే?

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

తర్వాతి కథనం
Show comments