Webdunia - Bharat's app for daily news and videos

Install App

అగరబత్తుల విక్రయానికి శ్రీకారం చుట్టిన తితిదే

Webdunia
సోమవారం, 13 సెప్టెంబరు 2021 (13:12 IST)
దేశంలోని పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటైన తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) అగరబత్తుల విక్రయానికి శ్రీకారం చుట్టింది. తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ఉప‌యోగించిన పుష్పాల‌తో ప‌రిమ‌ళాలు వెదజల్లే అగ‌ర‌బ‌త్తులు త‌యారుచేసి భ‌క్తుల‌కు అందుబాటులోకి తీసుకువచ్చింది. 
 
తిరుపతిలోని ఎస్వీ గోశాలలో అగరబత్తుల విక్రయాన్ని తితిదే ఛైర్మన్‌ వైవీ. సుబ్బారెడ్డి ప్రారంభించారు. శ్రీనివాసుని ఏడుకొండ‌ల‌కు సూచిక‌గా ఏడు బ్రాండ్లతో వీటిని తీసుకొచ్చారు. అభయహస్త, తందనాన, దివ్యపాద, ఆకృష్టి, సృష్టి, తుష్టి, దృష్టి అనే బ్రాండ్లతో వీటిని ప్రారంభించారు.
 
తిరుమలలోని లడ్డూ కౌంటర్లలో వీటిని విక్రయించనున్నారు. వీటి తయారీకి దర్శన్‌ ఇంటర్నేషన్‌ సంస్థ, వైఎస్సార్‌ ఉద్యాన వర్సిటీతో తితిదే ఒప్పందం కుదుర్చుకుంది. స్వామి వారి సేవ‌కు వినియోగించిన ఈ  పుష్పాలు వృథా కాకుండా తిరిగి ఉప‌యోగించే విష‌యంపై తితిదే బోర్డు వినూత్న ఆలోచన చేసింది. 
 
ఈ క్రమంలో బెంగ‌ళూరు కేంద్రంగా పనిచేస్తున్న దర్శన్‌ ఇంట‌ర్నేష‌న‌ల్ సంస్థ తితిదే ఆల‌యాల్లో రోజువారీగా వినియోగించిన పుష్పాల‌ను అందిస్తే లాభంతో సంబంధంలేకుండా అగ‌ర‌బ‌త్తులు త‌యారుచేసేందుకు ముందుకొచ్చింది. దీంతో ఆ సంస్థతో తితిదే అవగాహన కుదుర్చుకొని ఎస్వీ గోశాల‌లో అగ‌ర‌బ‌త్తుల త‌యారీకి అవ‌స‌ర‌మైన స్థలం కేటాయించింది. దర్శన్‌ ఇంట‌ర్నేష‌న‌ల్ సంస్థ సొంత ఖ‌ర్చుతో యంత్రాలు, సిబ్బందిని నియ‌మించుకుని అగ‌ర‌బ‌త్తుల ఉత్పత్తిని ప్రారంభించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments