Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమ్మకానికి 133 యేళ్ల విజయవాడ రైల్వే స్టేషన్!

Advertiesment
అమ్మకానికి 133 యేళ్ల విజయవాడ రైల్వే స్టేషన్!
, శుక్రవారం, 10 సెప్టెంబరు 2021 (22:33 IST)
కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 133 సంవత్సరాల విజయవాడ రైల్వే స్టేషన్‌ను అమ్మకానికి పెట్టింది. మోనిటైజేషన్ పేరుతో ఈ రైల్వే స్టేషన్‌ను ప్రైవేటుపరం చేయాలని సంకల్పించింది. ప్రస్తుతం ఈ రైల్వే స్టేషన్‌ దేశంలో ఏ1 కేటగిరీ రైల్వే స్టేషన్లలో ఒకటిగా వుంది.
 
ఈ మోనిటైజేషన్ పేరుతో కేవలం ఈ రైల్వే స్టేషన్‌ను మాత్రమే కాదు విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో ఉన్న రైల్వే ఆస్తులనుకూడా తెగనమ్మనున్నారు. ఇందులో మొదటి వరుసలో సత్యనారాయణపురం రైల్వే కాలనీ వుంది. ఈ రైల్వే డివిజన్ పరిధిలో ఉన్న రైల్వే షెడ్లను ఈ ప్రైవేటు సెక్టార్ కంపెనీలు గోడౌన్స్‌గా ఉపయోగించుకోనున్నాయి. అయితే, కేంద్రం నిర్ణయాన్ని సౌత్ సెంటర్ రైల్వే మజ్దూర్ యూనియన్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగుతుంది. అయినప్పటికీ కేంద్రం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో క్రమంగా పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు