Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వినాయక చవితికి మాంసం అమ్మకాలపై నిషేధం..ఎక్కడ?

Advertiesment
వినాయక చవితికి మాంసం అమ్మకాలపై నిషేధం..ఎక్కడ?
, బుధవారం, 8 సెప్టెంబరు 2021 (23:07 IST)
బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) కీలక నిర్ణయం తీసుకుంది. వినాయక చవితి సందర్భంగా బెంగళూరు నగరంలో మాంసం అమ్మకాలపై నిషేధం విధించింది. సెప్టెంబర్ 10న జంతువులను చంపడం, మాంసం అమ్మకాన్ని నిషేధిస్తూ బీబీఎంపీ జాయింట్ కమిషనర్ పేరిట ఉత్తర్వులు జారీ అయ్యాయి. 
 
నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని నగర పాలిక సంస్థ హెచ్చరించింది. కొన్నిరోజుల క్రితం వినాయక చవితి వేడుకలు, విగ్రహ నిమజ్జన ఉత్సవాల్లో 20 మందికి మించి పాల్గొనకూడదని కర్ణాటక ప్రభుత్వం నిబంధనలు విధించిన సంగతి తెలిసిందే.
 
అలాగే రాత్రి 9 గంటలు దాటిన తర్వాత ఎటువంటి కార్యక్రమాలకూ అనుమతి ఉండదని ప్రభుత్వం జారీ చేసిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ స్పష్టం చేశాయి. కరోనాను కట్టడి చేసేందుకు పండుగ సమయంలో నైట్ కర్ఫ్యూ అమలు జరుగుతుందని ఈ నిబంధనలు తేల్చి చెప్పాయి.
 
కేవలం మట్టి విగ్రహాలకే అనుమతులు ఉన్నాయని, అలాగే చవితి ఉత్సవాల్లో ఆహారం లేక ప్రసాదం పంపిణీకి కూడా అనుమతించబోమని ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో 2శాతం కన్నా ఎక్కువ పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాల్లో ఎటువంటి కార్యక్రమాలూ జరగబోవని వెల్లడించింది.
 
సెప్టెంబర్ 10 నుంచి నగరంలో మూడు రోజుల గణేశ పూజ వేడుకలను మాత్రమే బహిరంగ ప్రదేశాలలో అనుమతించింది ప్రభుత్వం. బెంగళూరులో గణేశ ఉత్సవాన్ని మూడు రోజులకు మించి అనుమతించబోమని, విగ్రహాన్ని తీసుకొచ్చేటప్పుడు లేదా నిమజ్జనం చేసే సమయంలో ఎలాంటి ఊరేగింపు ఉండరాదని అధికారులు తేల్చి చెప్పారు.
 
హిందువులు ఎంతో పవిత్రంగా చేసుకునే ఉత్సవం వినాయక చవితి. దేవతల్లో ముందుగా పూజలందుకునే వినాయకుడిని భక్తులు 11 రోజులు పూజిస్తారు. ఊరూ.. వాడ.. గణేశుడి మండపాలతో అంగరంగ వైభవంగా జరుపుతారు. పూజలు, దీప ధూప నైవేద్యాలు ఉంటాయి. అయితే కరోనా కారణంగా గతేడాది ఉత్సవంపై ఆంక్షలు ఉన్నాయి. ఈ ఏడాది కూడా ఆంక్షలున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కన్నకూతురిపైనే తండ్రి లైంగికదాడి.. ఎక్కడంటే?