Webdunia - Bharat's app for daily news and videos

Install App

15 ఏళ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు 15 గ్రాముల గోల్డ్ కాయిన్స్, ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 6 మే 2022 (17:56 IST)
మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థలో 10 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ సంవత్సరాలు పూర్తి చేసిన ఉద్యోగులను అభినందించడానికి, గుర్తించడానికి, సెలబ్రేట్ చేసుకోవడానికి, సత్కరించడానికి ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. సంస్థ యొక్క వృద్ధికి సహకారాన్నిఅందించడానికి, ఈ ఉద్యోగులందరూ సంవత్సరాలుగా చేసిన కృషి, సహకారాన్ని అభినందించడానికి ‘కాంపౌండింగ్ కంట్రిబ్యూటర్స్’ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో, MOFSL వ్యాపారాలలో అత్యల్ప స్థాయి నుండి ఉన్నత స్థాయి వరకు వివిధ హోదాలను కలిగి ఉన్న 240 కంటే ఎక్కువ ఉద్యోగుల సహకారాన్ని గుర్తించింది.

 
జూలై 2021లో జరిగిన వ్యవస్థాపక దినోత్సవంలో సంస్థ ఉద్యోగుల కృషిని గుర్తించడంతో కాంపౌండింగ్ కంట్రిబ్యూటర్స్ చొరవ ప్రారంభమైంది. వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా, Mr. ఓస్వాల్ MOFSLలో 10కి పైగా సంవత్సరాలను పూర్తి చేసిన ఉద్యోగసహచరులు అందించిన సహకారాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు, అభినందించారు. ఆ కాలంలోని పాక్షిక లాక్‌డౌన్ MOFSLని తక్షణమే ఎలాంటి ఫిజికల్ ఈవెంట్లు చేయడానికి అనుమతించలేదు; అయితే, ఈవెంట్లలో భాగంగా, MOFSL యొక్క సోషల్ మీడియాలో ఈ ‘కాంపౌండింగ్ కంట్రిబ్యూటర్ల’ పేర్లు మరియు ఫోటోలు ప్రచురించబడ్డాయి, వారి సహకారాన్ని అభినందిస్తున్నాము.

 
సన్మాన కార్యక్రమంలో ప్రతి ఉద్యోగిని అతని లేదా ఆమె కుటుంబంతో కలిసి వేదికపైకి ఆహ్వానించారు మరియు బంగారు నాణెం బహుకరించారు. ఈ వ్యక్తిగతీకరించిన బంగారు నాణేలుపై ఉద్యోగి పేరును పొందుపరిచారు. ప్రతి ఉద్యోగికి అందించిన ఈ నాణేల బరువు వారు సంస్థలో గడిపిన పదవీకాలం ప్రకారం నిర్ణయించబడింది. సంస్థలో 20 ఏళ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు 20 గ్రాముల గోల్డ్ కాయిన్ లభించింది. 15-20 ఏళ్లు సర్వీస్ చేసిన వారికి 15 గ్రాముల గోల్డ్ కాయిన్ అందింది. చివరగా, 10-15 సంవత్సరాలు నిండిన ఉద్యోగులకు 10 గ్రాముల గోల్డ్ కాయిన్ లభించింది. 

 
కార్యక్రమంలో తన కృతజ్ఞతా ప్రసంగంలో, MOFSL యొక్క MD మరియు CEO, Mr మోతీలాల్ ఓస్వాల్ ఇలా వ్యాఖ్యానించారు, “ఒక దశాబ్దం మరియు అంతకంటే ఎక్కువ కాలం పాటు ఈ సంస్థలో భాగమైన ఉద్యోగులందరి కృషిని మేము నిజంగా అభినందిస్తున్నాము. ప్రతి ఒక్కరూ చేసిన కృషి మరియు అంకితభావాన్నిమేము గౌరవిస్తాము. ఇది కేవలం 3 మంది ఉద్యోగులతో ఎలా ప్రారంభమైందో మరియు 10,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగుల బలం గురించి గొప్పగా చెప్పుకుంటూ కాలక్రమేణా సంస్థ ఎలా అభివృద్ధి చెందిందనే జ్ఞాపకాలను వివరించడం నిజంగా ఆనందంగా ఉంది.’’

 
తన కృతజ్ఞతా ప్రసంగంలో, ఛైర్మన్ మరియు సహ వ్యవస్థాపకుడు మిస్టర్ రామ్‌డియో అగర్వాల్ ఇలా అన్నారు, “ఈ సంస్థ ఎదుగుదలకు సహాయం చేయడంలో మా ఉద్యోగుల సహకారాన్ని సెలబ్రేట్ చేసుకోవడం మాకు చాలా గర్వంగా ఉంది. ప్రతి ఉద్యోగి వారి కుటుంబంతో కలిసి ఈ విజయాన్ని నిజంగా జరుపుకుంటారని మేము హృదయపూర్వకంగా ఆశిస్తున్నాము, ఎందుకంటే వారి సహకారం ద్వారా సంస్థ కొనసాగుతుంది మరియు అభివృద్ధి చెందుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Los Angeles: హాలీవుడ్ స్థాయిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా - లాస్ ఏంజెల్స్ టెక్నికల్ టీమ్ తో చర్చలు

Allu Arjun: అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ మాత్రమే కాదు, ప్రకటనల రంగంలోనూ పవర్ హౌస్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments