మెడభాగం నల్లగా ఉందా..?

Webdunia
బుధవారం, 20 మార్చి 2019 (15:15 IST)
అందంగా, మృదువుగా కనిపించే మెడభాగాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. మెడమీది చర్మం సున్నితంగా ఉంటుంది.. కాబట్టి మృదువుగా శుభ్రం చేయాలి. జుట్టు నుండి మెడకు అంటుకునే జిడ్డును తొలగించేందుకు స్నానం చేసేటప్పుడు ప్రత్యేకంగా దృష్టి సారించాలి.
 
ఎండల్లో తిరిగినప్పుడు ఇంటికి రాగానే వేన్నీళ్లతో మెడను శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత మెత్తని టవల్‌తో తుడుచుకోవాలి. కవరింగ్ నగలు ధరించటంవలన నల్లని మచ్చలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మచ్చలు కారణంగా చర్మదురదలు కూడా వస్తాయి. కాబట్టి కవరింగ్ నగలను ధరించకపోవడమే ఉత్తమం.
 
మెడభాగానికి ఆలివ్ నూనె రాసి మసాజ్ చేయడం వలన ఆ ప్రాంతమంతా నున్నగా, మృదువుగా ఉంటుంది. రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందుగా ఆలివ్ నూనెను రాసుకుని ఉదయాన్నే లేచిన వెంటనే గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.
 
రోజుకు కనీసం రెండుసార్లు 5 నిమిషాలపాటు మెడను పైకి ఎత్తడం, వంచడం, అటూ ఇటూ తిప్పడం చేయాలి. ఇలా చేయడం వలన మెడ కండరాలు చక్కగా పనిచేస్తాయి. కొద్దిగా గ్లిజరిన్‌ తీసుకుని అందులో కొన్ని నిమ్మరసం చుక్కలు కలపాలి. ఈ మిశ్రమాన్ని రాత్రిపూట పడుకునేటపుడు మెడకు రాసి, ఉదయాన్నే శుభ్రం చేసుకుంటే కొద్దిరోజుల్లోనే మెడ మెరిసిపోతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భారత్ నరక కూపం కాదు ఎంతో గొప్ప దేశం, రీపోస్ట్ చిక్కు నుంచి బైటపడేందుకు ట్రంప్

రూ. 10 లక్షలిస్తా, నా భర్తను చంపేయండి: ప్రియుడి కోసం వివాహిత సుపారీ

దేశంలో పెరుగుతున్న వేసవి ఉష్ణోగ్రతలు.. కేరళలో వడదెబ్బకు వ్యక్తి మృతి

తెగే దాకా లాగొద్దు ట్రంప్, డేటా తీగలు తెగుతాయ్, పర్షియన్ గల్ఫ్ నెట్ గల్లంతే: ఇరాన్ IRGC హెచ్చరిక

బెంగాల్‌లో బీజేపీ సర్కారు ఏర్పాటైతే చొరబాటుదారుల ఆటకట్టిస్తాం : అమిత్ షా

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లు అర్జున్ బ్లాక్‌బస్టర్ సరైనోడు 10వ వార్షికోత్సవం

ఎవరే’ పాట మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను : అంబటి అర్జున్

MS Raju: ఎమ్మెస్ రాజు అగధ లో‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

JD Chakravarthy: నచ్చకపోతే థియేటర్స్‌లోనే కాదు, ఓటీటీలో కూడా చూడరు : జేడీ చక్రవర్తి

SV Krishna Reddy: SV కృష్ణారెడ్డి వేదవ్యాస్ చిత్రం బేనర్ పూజకార్యక్రమాలు

తర్వాతి కథనం
Show comments