ఆకలిపై బ్లూలైట్ ఎఫెక్ట్...కళ్లు కూడా

Webdunia
బుధవారం, 20 మార్చి 2019 (14:29 IST)
నేటి ఆధునిక యుగంలో దాదాపు అందరూ ఎలక్ట్రానిక్ పరికరాలు వాడుతున్నారు. డిజిటల్ పరికరాలలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది స్మార్ట్‌ఫోన్‌ల గురించి. ప్రతి ఒక్కరి చేతిలో నేడు స్మార్ట్‌ఫోన్‌లు దర్శనమిస్తున్నాయి. ప్రపంచాన్నంతా గుప్పట్లో ఉంచగల స్మార్ట్‌ఫోన్‌ల వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అయితే అదే స్థాయిలో దుష్ప్రయోజనాలు కూడా ఉన్నాయి. 
 
ఇక ఈ డివైసెస్ నుండి వచ్చే బ్లూలైట్ గురించి మాట్లాడుకుంటే, దీని వలన మన కంటి చూపు తగ్గిపోయి, మెల్లగా చూపు కోల్పోయే ప్రమాదం ఉందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ బ్లూలైట్ వలన కంట్లోని రెటీనా దెబ్బతిని, క్రమంగా మాక్యులా క్షీణిస్తుంది. దీని వలన అంధత్వం త్వరగా సంభవిస్తుంది. అందుకే పరిశోధకులు బ్లూలైట్ ఎఫెక్ట్ పడకుండా కళ్లను కాపాడుకోవడం కోసం, UV మరియు బ్లూలైట్‌ని ఫిల్టర్ చేసే సన్‌గ్లాసెస్ ధరించమని, చీకటిలో స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్ వంటి డిజిటల్ పరికరాలను ఉపయోగించకూడదని సూచిస్తున్నారు.
 
తాజాగా జరిగిన పరిశోధనలలో బ్లూలైట్‌కు ఎక్కువగా ఎక్స్‌పోజ్ అవుతున్నవారు బరువు పెరుగుతున్నట్లు కూడా గుర్తించారు. డిజిటల్ పరికరాల నుండి వెలువడే బ్లూలైట్‌ను చూడటం మొదలుపెట్టిన పావు గంట నుండి ఆకలి ప్రభావం మొదలవుతుంది. ఇక ఎక్కువసేపు దీనినే చూస్తూ ఉంటే ఆకలి మరింత ఎక్కువవుతుంది. దీని వలన మనం తీసుకునే ఆహార పరిమాణం పెరిగి లావైపోవడం ఖాయం. ఇక దీని వలన నిద్రలేమి సమస్య కూడా ఎక్కువవుతుంది. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలంటే స్మార్ట్‌ఫోన్‌లతో గడిపే సమయం తగ్గించాలి మరి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బీహార్ కొత్త ముఖ్యమంత్రి సమ్రాట్ చౌధరీ

Heat Wave Alert : ఐదు రోజుల పాటు తెలంగాణలో వడగాలులు

తండ్రి మందలించాడని.. సైకిల్‌పై రాత్రంతా తొక్కుతూ 100 కిలోమీటర్లు.. ఎక్కడా ఆగలేదు..

బీహార్ ముఖ్యమంత్రి పదవికి నితీశ్ కుమార్ రాజీనామా

అమరావతిలో క్వాంటం ఫెసిలిటీ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharwanand: శర్వానంద్, సంపత్ నంది చిత్రం భోగి హై-ఆక్టేన్ యాక్షన్ కొత్త షెడ్యూల్

Samantha: సమంత నటించిన మా ఇంటి బంగారం ఆడియో హక్కులు పొందిన థింక్ మ్యూజిక్

Suriya: తమిళ సంవత్సర సందర్భంగా సూర్య కరుప్పు నుండి రాతు రాసన్ విడుదల

స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే నుండి రెండు సరికొత్త పోస్టర్లు విడుదల

టాలీవుడ్‌లో మరో ఐరెన్ లెగ్ హీరోయిన్ శ్రీలీలనా?

తర్వాతి కథనం
Show comments