Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజూ రాత్రి పడుకోటానికి ముందు ఒక చెంచా ఆ రసాన్ని తేనెతో కలిపి...

Webdunia
బుధవారం, 15 మే 2019 (20:58 IST)
వేసవిలో ఎండలలో తిరగడం వలన చర్మం కాంతిని కోల్పోయి కాంతివిహీనంగా మారుతుంది. మనకు సహజసిద్దంగా లభించే కొన్ని పదార్దాలతో మనం ఈ సమస్యను నివారించుకోవచ్చు. అంతేకాకుండా చాలా తక్కువ ఖర్చుతో మన ఇంట్లో లభించే పదార్దాలతోనే మనం ఈ సమస్యను నివారించుకోవచ్చు. అదెలాగో చూద్దాం. 
 
1. యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉండే తేనె చర్మాన్ని సున్నితంగా మార్చటమే కాకుండా, యవ్వనంగా కనపడేలా చేస్తుంది. ఒక చెంచా తేనెను తీసుకొని, దానికి చిటికెడు దాల్చిన చెక్క కలిపి ముఖాన్నికి అప్లై చేయాలి. కొద్ది సమయం తరువాత కడిగి వేయండి. ఇలా రోజు చేయటం వలన ముఖం కాంతి రెట్టింపు అవుతుంది.
 
2. యాంటీ ఆక్సిడెంట్ మరియు విటమిన్ సి  అధికంగా కలిగి ఉండే ఉసిరి చర్మాన్ని ఆరోగ్యంగా, మెరిసేలా చేస్తుంది. దీనితో పాటుగా చర్మ నిర్మాణాన్ని సరి చేస్తుంది. రోజు రాత్రి పడుకోటానికి ముందు ఒక చెంచ ఉసిరిరసాన్ని, ఒక చెంచా తేనెను కలపి ముఖానికి అప్లై చేసి పడుకోండి. మరుసటి రోజు కడిగి వేయాలి. ఇలా చేయడం వలన చర్మం కాంతివంతంగా ఉంటుంది.
 
3. పెరుగు వలన ఆరోగ్యానికే కాదు, సౌందర్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. పెరుగును మన చర్మానికి అప్లై చేసి కొద్ది నిమిషాల పాటూ అలాగే ఉంచి కడగి వేయండి. దీనిలో ఉండే లాక్టిక్ ఆసిడ్ చర్మ రంద్రాలలో పేరుకుపోయిన దుమ్ము, ధూళి కణాలను తొలగించి, పాల వంటి చర్మాన్ని అందిస్తుంది.
 
4. టమోటాను తెసుకొని గుజ్జుగా మార్చి, దీనికి కొన్ని చుక్కల నిమ్మరసాన్ని కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి కనీసం ఇరవై  నిమిషాల పాటు ఉంచి, తరువాత కడిగి వేయాలి. టమోటాలో ఉండే లైకోపీన్ అనే సమ్మేళనం, సూర్యకాంతి వలన డల్‌గా మారిన చర్మాన్ని తిరిగి పునరుద్దరణకు గురి చేస్తుంది. అంతేకాకుండా, చర్మ నిర్మాణాన్ని మరియు నాణ్యతను కూడా మెరుగుపరుస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Smiling Face Sky: అరుదైన ఖగోళ దృశ్యం.. చంద్రునికి దగ్గరగా శుక్ర-శని గ్రహాలు.. ఆకాశంలో స్మైలీ

జార్ఖండ్‌లో కర్ణిసేన రాష్ట్ర అధ్యక్షుడు అనుమానాస్పద మృతి!!

మాజీ డీజీపీ భర్తను లేపేసిన భార్య.. ఐ హ్వావ్ ఫినిష్డ్ మాన్‌స్టర్ మెసేజ్!

Skull Discovered on Mars: అంగారక గ్రహంపై మానవ పుర్రె లాంటి రాయి

ఒకే ఆలయం.. ఒకే బావి.. ఒకే శ్మశానవాటిక : మోహన్ భగవత్ పిలుపు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika: హీరోయిన్లను అలా చూపించేందుకు దర్శకులు ఇష్టపడతారు

Anushka: ఘాటి చిత్ర విజయంపై అనుష్క శెట్టి కెరీర్ ఆధారపడి వుందా?

శివరాజ్ కుమార్ చిత్రం వీర చంద్రహాస తెలుగులో తెస్తున్న ఎమ్‌వీ రాధాకృష్ణ

Dhanush: కుబేర ఫస్ట్ సింగిల్ పోయిరా మామా..లో స్టెప్ లు అదరగొట్టిన ధనుష్

మలేషియాలో చిత్రీకరించబడిన విజయ్ సేతుపతి ACE చిత్రం

తర్వాతి కథనం
Show comments