వేసవిలో చేపలు, మాంసం వంటి వాటిని ఫ్రిజ్‌లో నిల్వచేసుకుంటే?

ఆదివారం, 12 మే 2019 (11:47 IST)
వేసవిలో చేపలు, మాంసం వంటి వాటిని ఫ్రిజ్‌లో నిల్వ చేసి వాడుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఒక రోజుకు మించి ఉంటే వాటిని పారేయాలి. వేసవిలో దాహంతో సంబంధం లేకుండా పరిశుభ్రమైన నీటిని తాగాలి. లేకపోతే శరీరం డీహైడ్రేషన్‌కి గురి నిస్సత్తువ ఆవరిస్తుంది. అలాని మరీ చల్లగా ఉండే నీటి తాగకూడదు. 
 
ఈ కాలంలో తేలికగా ఉండే పోషకాహారాన్ని తీసుకోవాలి. అతిగా కొవ్వు పదార్థాలు వాడి చేసిన పదార్థాలకు దూరంగా ఉండటమే మేలు. డ్రైఫ్రూట్స్ కన్నా.. తాజాగా ఉండే పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. తులసి ఆకులతో చేసిన టీ శరీరాన్ని చల్లగా వుంచుతుంది. పంచదార ఉపయోగించని తాజా పండ్ల రసాలు, సలాడ్లు హాని చేయని ఆహారం. 
 
నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, మజ్జిగ కావాల్సినంత తీసుకోవచ్చు. మామిడి శరీరానికి కావాల్సిన విటమిన్ ఎని సంపూర్ణంగా అందిస్తుంది. సమోసాలు, వడలు, బజ్జీలు పూర్తిగా నివారించాలని వైద్యులు హెచ్చరించారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం తిన్న వెంటనే పడుకుంటే ఏమవుతుందో తెలిస్తే షాకే...