Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొబ్బరి నీటితో.. చర్మ రక్షణ ఎలా..?

Webdunia
బుధవారం, 28 నవంబరు 2018 (10:50 IST)
ఈ కాలంలో చర్మ సంబంధ సమస్యలతో ఎంతో మంది పలురకాల ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. రకరకాల క్రీమ్స్ వాడినా చర్మం కళ తప్పి, పొడిబారి కాంతి హీనంగా మారుపోయింది. అందుకు ఏం చేయాలో తెలియక సతమతమవుతుంటారు. ఈ సమస్య నుండి ఉపశమనం లభించాలంటే.. కొబ్బరి నీళ్లు తాగడం చక్కటి పరిష్కారమని చెప్తున్నారు నిపుణులు.
 
కొబ్బరినీళ్లు దప్పికను తీర్చడమే కాదు.. ఆరోగ్యానికీ, చర్మానికీ ఎంతో మేలు చేస్తాయి. పొడిబారిన చర్మంతో బాధపడేవారు రోజుకో గ్లాస్ కొబ్బరినీళ్లు తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఆ నీళ్లలో ఉండే పోషకాలు చర్మానికి తేమనందించి, పొడిబారకుండా చేస్తాయి. కొబ్బరినీళ్లల్లో ఉండే యాంటీఆక్సిడెంట్స్, యాంటీ ఏజింగ్ కారకాలూ వృద్ధాప్య ఛాయలు కనిపించకుండా చేస్తాయి.
 
కొబ్బరి నీళ్లల్లో కొద్దిగా పెరుగు, నిమ్మరసం, తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. గంట పాటు అలానే ఉంచి ఆ తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే చర్మం పొడిబారకుండా ఉంటుంది. తద్వారా కాంతివంతమైన చర్మాన్ని మీ సొంతం చేసుకోవచ్చును. 
 
ఈ నీటి ద్వారా చర్మం కొత్త మెరుపు సంతరించుకుంటుంది. ఈ కాలంలో ఇవన్నీ చేయాలంటే కాస్త బద్ధకంగా ఉంటుంది. జీర్ణశక్తి మందగిస్తుంది. కొబ్బరినీళ్లు తాగడం వల్ల ఆ సమస్యలేమీ బాధించవు. తక్షణ శక్తి అందుతుంది. శీతాకాలం కదా అని... కొబ్బరినీళ్లకు దూరమైతే ఈ ఫలితాలన్నింటినీ మనం కోల్పోయినట్టే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Baby Gorilla: ఇస్తాంబుల్ విమానాశ్రయంలో బేబీ గొరిల్లా.. ఎలా పట్టుబడిందంటే? (viral video)

అల్లు అర్జున్ వ్యవహారం.. నోరెత్తకండి.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

తెలుగు రాష్ట్రాల్లో హడలెత్తిస్తోన్న అఘోరీ.. కేసులు నమోదు.. ఏం జరిగిందంటే?

Chandrababu: అమరావతి నిర్మాణ పనులకు రూ.2,723 కోట్లు ఆమోదం..

ఐకాన్ స్టార్ అయితే ప్రత్యేక రాజ్యాంగం ఉంటుందా?: మంత్రి కోమటిరెడ్డి (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venkatesh : ఆర్‌ఎఫ్‌సీలో సంక్రాంతి స్పెషల్ సాంగ్ షూటింగ్

మంథన్ సినిమా తీసిన విధానం తెలుసుకుని ఆశ్చర్యపోయా : పవన్ కళ్యాణ్ నివాళి

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

తర్వాతి కథనం
Show comments