Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్త్రీలకు నడుము నొప్పి ఎందుకు వస్తుందో తెలుసా..?

Advertiesment
back pain
, మంగళవారం, 27 నవంబరు 2018 (14:56 IST)
స్త్రీల విషయంలో నడుము భాగం ఎంత బాధిస్తుందో అనుభవించేవారికి తెలుస్తుంది. స్త్రీలలో 90 శాతం మందికి నడుం నొప్పి చాలా ప్రధానమైన, సామాన్యమైన సమస్య. నడుము నొప్పి రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. కానీ వాటి నివారణకు మాత్రం అన్ని పరిష్కారాలు లేవు. ఏళ్ల తరబడి నడుము నొప్పితో బాధపడుతూ.. అలాగే సర్దుకుపోయే మహిళలు దాదాపు 70 నుండి 80 శాతం వరకు ఉన్నారు. అసలు నడుము నొప్పి ఎందుకు వస్తుందో తెలుసుకుందాం..
 
స్త్రీలలో నడుమునొప్పి రావడానికి అనేక కారణాలున్నాయి. ప్రసవం అయిన తరువాత శరీరంలో జరిగే మార్పుల వలన నడుము నొప్పి రావడం సర్వసాధారణం. నడుము కింది భాగంలో ఉండే నొప్పి కిందికి వంగినప్పుడో, వెనుకకు వాలినప్పుడో ఇంకా తీవ్రంగా ఆడవారిని బాధిస్తుంది. 
 
దీనికి కారణం వెన్నెముకలో కణతలు ఒత్తిడికి లోనైనప్పుడు నొప్పి పుడుతుంది. వెన్నెముకలో కనీసం 200 కణతలు ఉంటాయి. వాటి ఆధారంగానే మనం నిటారుగా నిలబడగలుగుతాం. గర్భం ధరించినప్పుడో, బరువు పెరిగినప్పుడో ఈ భాగంపై ఒత్తిడి పెరిగితే అది క్రమంగా నడుము నొప్పికి దారితీస్తుంది. ఒక్కోసారి వయస్సు మీరడం వలన కండరాలు అరిగి కూడా ఈ భాగంలో నొప్పి రావడానికి అవకాశం ఉంది. 
 
సాధారణంగా కండరాలపై ఒత్తిడి కారణంగా వచ్చే నడుము నొప్పి కొద్ది వారాల పాటు బాధించి క్రమంగా తగ్గిపోతుంది. అయితే ఇది మళ్లీ రాదన్న గ్యారంటీ లేదు. కాబట్టి మళ్లీ నొప్పి రాకుండా తగిన శరీర వ్యాయామం చేయడం, మందులు వాడడం, విశ్రాంతి తీసుకోవడం వంటివి చేయాలి.
 
నడుము నొప్పికి బాధపడలేక అది తగ్గడం కోసం ఇబుప్రొఫెన్‌ గానీ, పారాసిటమాల్‌ గానీ వాడమని వైద్యులు సలహా ఇస్తుంటారు. అయితే ఇది తాత్కాలికంగా ఉపశమనం పొందడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. అల్ట్రాసౌండ్‌ ద్వారా గానీ, డయాథెర్మీ వంటి ఫిజియోథెరపీ చికిత్సల ద్వారా నడుము నొప్పిని తగ్గించుకోవచ్చు.
 
ఈ నొప్పి వచ్చినప్పుడు పూర్తిగా బెడ్‌రెస్ట్ తీసుకోవడం ఎంతైనా శ్రేయస్కరం. ఇంటి పనులు, పిల్లల పనులు తగ్గించుకుని, వీలుంటే వదిలిపెట్టి మరీ విశ్రాంతి తీసుకోవాలి. నొప్పిని భరిస్తూ ఎలాగోలా పనిచేసుకుంటూ పోతే ఆ తరువాత సమస్య మరింత తీవ్రమై మిమ్మల్ని మరింత క్షోభకు గురి చేయడం ఖాయం.

నడుము నొప్పి వచ్చినప్పుడు పడుకునే విధానం ద్వారా కూడా దానిని తగ్గించుకోవచ్చు. వట్టి నేలపై గానీ, చెక్కపైగానీ వెల్లకిలా పడుకోవడం ఉత్తమమని చెబుతారు. ఒకవేళ అది కుదరని పక్షంలో కనీసం మెత్తటి పరుపులపై పడుకోవడం మాని గట్టి పరుపులపై పడుకోవడం అలవాటు చేసుకుంటే మేలు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెదాలు మృదువుగా మారాలంటే.. ఇలా చేయాలి..?