Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాలలో గంధం చెక్కని అరగదీసి అక్కడ రాస్తే...

Webdunia
బుధవారం, 13 ఫిబ్రవరి 2019 (19:28 IST)
సాధారణంగా ముఖం అందంగా ఉన్నప్పటికి మొటిమలు, బ్లాక్ హెడ్స్ ఉండటం వల్ల చాలా సతమవుతూ ఉంటాం. వీటికి అనేక రకములైన క్రీంలు వాడితే చర్మ పాడైపోతుంది. అలాకాకుండా ఉండాలంటే మన ప్రకృతిలో సహజంగా లభించే గంధంలో చర్మానికి మేలు చేసే సుగుణాలెన్నో ఉన్నాయి. చర్మ ఛాయను మెరుగుపరచడం, మొటిమల్ని అదుపులో ఉంచడం వంటి లక్షణాలు గంధంలో ఉన్నాయి. మరి గంధాన్ని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
 
1. పాలలో గంధం చెక్కని అరగదీసి దానికి కాస్త పంచదార కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసి సవ్య అపసవ్య దిశల్లో మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై పేరుకున్న మురికి తొలగిపోతుంది. కాంతివంతంగా కనిపిస్తుంది. 
 
2. సూర్యకిరణాల తాకిడికి ఎండ తగిలే శరీర భాగాలు రంగు మారుతుంటాయి.ఇలాంటప్పుడు పావుకప్పు గంధం పొడి, పావుకప్పు రోజ్ వాటర్, అరచెక్క నిమ్మరసం కలిపి ముఖానికి పూతలా వేయాలి. అరగంట తరువాత ముఖాన్ని చల్లని నీటితో కడిగివేయాలి. ఇలా కనీసం రెండు సార్లయినా చేస్తుంటే సమస్య దూరమవుతుంది.
 
3. ముఖంపై మొటిమల తాలూకా మచ్చలు కలవరపెడుతుంటాయి. అలాంటివారు గంధం పొడిలో చెంచా పాలు, రెండు చుక్కల తేనె కలిపి ఆ మిశ్రమాన్ని ముఖం, మెడ, చేతులకు పట్టించాలి. ఆరాక కొన్ని నీళ్లు తీసుకుని తడుపుతూ మృదువుగా మర్దనా చేయాలి. తరువాత చల్లని నీటితో కడిగివేయాలి. ఇలా చేయడం వల్ల మొటిమల సమస్య త్వరగా దూరమవుతుంది.  ముఖం తాజాగా కనిపిస్తుంది.
 
4. బ్లాక్ హెడ్స్ ఉన్నవారు గంధం పొడిలో చెంచా పసుపు, కర్పూరం కలిపి ముఖానికి పూతలా వేసుకోవాలి. పదిహేను నిమిషాల తరువాత కడిగివేయాలి. బ్లాక్ హెడ్స్ వంటి సమస్యలు ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకునే ముందు రాసుకుని ఉదయాన్నే శుభ్రపరచుకోవాలి. ఇలా చేయడం వల్ల ఈ సమస్య తొలగిపోతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తిరుపతి ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్.. ఎస్పీపై బదిలీవేటు

అవేవీ అవసరం లేకపోయినా కొంటూ, ఆర్భాటాలకు పోయి ఆర్థికంగా కుంగిపోతున్న ప్రజలు

తప్పు జరిగింది.. క్షమించండి.. పోలీసులు - ఫ్యాన్స్‌పై ఆగ్రహం : పవన్ కళ్యాణ్ (Video)

భార్యపై స్నేహితులతో అత్యాచారం చేయిస్తూ ఆనందిస్తున్న సౌదీ భర్త, పోలీసులు దర్యాప్తు

తిరుపతి కలెక్టర్ - ఎస్పీకి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్రహ్మా ఆనందం నుంచి లిరికల్ సాంగ్ ఆనందమానందమాయే.. రిలీజ్

నేను మీ నాగార్జునను.. ఇరానీ ఛాయ్‌, కరాచీ బిస్కెట్‌, హైదరాబాద్ బిర్యానీ... (Video)

తల్లి లేని ప్రపంచమే లేదు అందుకే కథను నమ్మి తల్లి మనసు తీశా: ముత్యాల సుబ్బయ్య

ఎన్నో అవార్డులు, రివార్డులతో సాయి కుమార్ 50 ఏళ్ల ప్రస్థానం

మహేష్‌బాబు విడుదల చేసిన సుకృతి వేణి గాంధీ తాత చెట్టు ట్రైలర్‌

తర్వాతి కథనం
Show comments