మహిళలపై ఎక్కడపడితే అక్కడ అకృత్యాలు జరుగుతున్నాయి. వయోబేధం లేకుండా మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా విమానంలో తోటి ప్రయాణికుడి వల్ల ఓ మహిళ లైంగిక వేధింపులు ఎదుర్కొంది. అతనికి 65ఏళ్లు.. కూతురు వయస్సున్న 41 ఏళ్ల మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ వ్యవహారం ఢిల్లీ నుంచి ముంబైకి వస్తున్న విస్తారా విమానంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. వ్యాపారవేత్త అనిల్‌కుమార్ మూల్ చందానీ ముంబై వెళ్లేందుకు ఫ్లైట్ ఎక్కాడు. ఆమె పక్క సీటులో 41 ఏళ్ల మహిళ కూర్చుంది. ఇక పక్కన కూర్చుంది.. ఎటూ సీటు మార్చుకోలేదనుకున్న అనిల్.. దాన్నే అదనుగా తీసుకుని.. ప్రయాణ సమయంలో పలుమార్లు లైంగికంగా వేధింపులకు గురిచేశాడు. ఆమెను ఎక్కడెక్కడో తాకాడు. అభ్యంతరకరంగా ప్రవర్తించాడు.
అతని వేధింపులను గత్యంతరం లేకపోవడంతో తట్టుకున్న బాధితురాలు ముంబైలో విమానం దిగగానే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు అనిల్ కుమార్‌పై ఐపీసీ సెక్షన్ 354 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.