బొప్పాయి పండుతో ముఖానికి మాస్క్ వేసుకున్నట్లయితే...?

Webdunia
సోమవారం, 14 జనవరి 2019 (14:51 IST)
బొప్పాయి పండు ఆరోగ్యానికే కాకుండా, చర్మం సౌందర్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. దీనిలో లభించే విటమిన్స్ నిర్జీవమైన చర్మాన్ని తొలగించి, కొత్త చర్మం ఏర్పడేందుకు దోహదం చేస్తాయి. బొప్పాయి పండుకు రక్తాన్ని శుద్ధిచేసే గుణం ఉండడంతో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.
 
గరుకు చర్మంతో ఇబ్బందిపడేవారికి బొప్పాయి పండు చక్కగా పనిచేస్తుంది. గరుకు చర్మాన్ని మృదువుగా మార్చే గుణం బొప్పాయికి మెండుగా ఉంది. బొప్పాయి తొక్కలను ఓ గిన్నెలో వేసి ఉడికించి, వాటిని మెత్తగా నూరి ముఖానికి రాసి 15 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి. వారానికి రెండు లేదా మూడుసార్లు ఇలా చేసినట్లైతే ముఖం కోమలంగా మారుతుంది.
 
బొప్పాయి పండుతో ముఖానికి మాస్క్ వేసుకున్నట్లయితే ముఖంపై ఉండే మృతుకణాలు తొలగిపోయి, చర్మం చాలా తేటగా మారుతుంది. అర టీస్పూన్ ముల్తానీ మట్టికి మరో స్పూన్ బొప్పాయి గుజ్జును కలిపి ముఖానికి పట్టించి బాగా మసాజ్ చేశాక.. గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే ముఖం కాంతివంతంగా తయారవుతుంది.
 
కళ్ల కింద నల్లటి వలయాలను తొలగించటంలో బొప్పాయి ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఓ స్పూన్ కలబంద గుజ్జు, స్పూన్ బొప్పాయి గుజ్జు తీసుకుని ముఖానికి పట్టించి ఆరిన తరువాత శుభ్రం చేసుకోవాలి. అయితే ఇది కళ్లలో పడకుండా జాగ్రత్త పడాలి. నానబెట్టిన ఎండుద్రాక్షలతోపాటు బొప్పాయి పండును నూరి ఆ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకుని శుభ్రం చేయాలి. ఇలా చేస్తే ముఖం కాంతివంతంగా మారుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తల్లి అంజనా దేవి పుట్టినరోజు.. జిరాఫీలను దత్తత తీసుకున్న పవన్ కల్యాణ్

అమరావతిలో దేశంలోనే తొలి ఏఐ విశ్వవిద్యాలయం.. ఫిబ్రవరి 19న ప్రారంభం

మేడారం ఉత్సవంలో నీటి లభ్యతను, రిటైల్ సాధికారతను కల్పిస్తున్న కోకా-కోలా ఇండియా

వైఎస్ జగన్‌ను ఏకిపారేసిన షర్మిల- అధికారం కోసమే జగన్ మరో పాదయాత్ర

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను చుట్టేసిన సీతాకోకచిలుకలు, ఆయనలో ఆ పవర్ వుందట...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

SriRam: ది మేజ్‌ నుంచి శ్రీరామ్‌ ఫస్ట్‌లుక్‌ అండ్‌ గ్లింప్స్‌

కొచ్చిలో ఒకొరగజ్జ ప్రచారాన్ని భగ్నం చేయడానికి వారే బాధ్యులు!

సీతా పయనం నుంచి పయనమే..మెలోడియస్, రొమాంటిక్ పాట విడుదల

ఓం శాంతి శాంతి శాంతిః రీమేక్ కనుక తరుణ్ చేయన్నాడు : సృజన్‌ యరబోలు

NTR: ఎన్‌టీఆర్ కు రక్ష‌ణ క‌ల్పించిన ఢిల్లీ హైకోర్టు

తర్వాతి కథనం
Show comments