Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దున్నపోతులు - గేదెలను మాత్రమే బ్రీడ్‌తో పోల్చుతారు.. నాగబాబు (వీడియో)

Advertiesment
Naga Babu
, గురువారం, 10 జనవరి 2019 (12:40 IST)
సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై మెగాబ్రదర్ నాగబాబు మరోమారు మండిపడ్డారు. పలు అంశాలను ప్రస్తావిస్తూ ఆయన మరో వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇందులో బాలకృష్ణ వ్యాఖ్యలపై మరోమారు ప్రస్తావించారు. మేము వేరు.. మా బ్రీడ్ వేరంటూ బాలయ్య గతంలో చేసిన కామెంట్స్‌కు నాగబాబు తనదైనశైలిలో కౌంటర్ ఇచ్చారు. అరుదైన దున్నపోతులు, గేదెలను మాత్రం బ్రీడ్‌లతో పోల్చుతారన్నారు. 
 
అంతేకుకుండా 'గుమ్మడి కాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్న' చందంగా బాలయ్య వ్యవహరిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. బాలకృష్ణ ఎవరో నాకు తెలియదు అన్నందుకే బాలయ్యకు అంత కోపమొస్తే.. తమ ఫ్యామిలీని లక్ష్యంగా చేసుకుని ఆరుసార్లు కామెంట్స్ చేసినందుకు తాము ఎలా రియాక్ట్ కావాలని నాగబాబు ప్రశ్నించారు. 
 
అంతేకాకుండా, ఓ చిన్న పిల్లోడు ముద్దుగా పాడాడు 'సారే జహాసె అచ్చా'. చక్కగా పాడాడని పెడితే, మీరెందుకు అసలు దానికి... మిమ్మల్ని ఏదో అనేశానని ఎందుకు అనుకుంటున్నారు? వ్యక్తిగతంగా మిమ్మల్ని పేరు పెట్టి పిలవలేదే. మహమ్మద్ ఇక్బాల్ అనే మహానుభావుడు రాసిన పాట. ఓ పిల్లాడు అందంగా పాడాడు. ఆ వీడియో నాకు వచ్చింది. నచ్చింది. నచ్చినదాన్ని ఫేస్‌బుక్‌లో పెట్టాను అని వివరణ ఇచ్చారు.
 
అంతేకాకుండా, బయోపిక్‌లపై తాను రాసిన ఓ కవిత్వానికి గల కారణాలను కూడా నాగబాబు వివరించారు. గతంలో అనేక బయోపిక్‌లు వచ్చాయనీ, మున్ముందు కూడా రాబోతున్నాయని చెప్పారు. బాలకృష్ణ ఒక్కరే బయోపిక్ మూవీని తీయలేదని గుర్తుచేశారు. అసలు ఎన్టీఆర్ బయోపిక్‌ను తాను చూడనేలేదని, అలాంటపుడు తాను ఎలా కామెంట్స్ చేస్తానని నాగబాబు ప్రశ్నించారు. అంతేకాకుండా, 2011లో తన అన్న చిరంజీవిని ఉద్దేశించి చేసిన కామెంట్స్‌కు తన ఆరో వీడియోలో కౌంటర్ ఇచ్చి ఈ వివాదానికి స్వస్తి పలుకుతానని నాగబాబు వెల్లడించారు. తాజాగా నాగాబాబు విడుదల చేసిన ఐదో వీడియోను ఓసారి మీరూ చూడండి. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'పేట' వర్సెస్ 'విశ్వాసం' - కత్తులతో ఫ్యాన్స్ కొట్లాట