Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజూ రాత్రి కీరదోస రసంతో ఇలా చేస్తే..?

Webdunia
శనివారం, 30 మార్చి 2019 (11:24 IST)
ఈ వేసవి కాలం వచ్చిదంటే చాలు చెమట ఎక్కువగా పట్టేస్తుంది. కొందరికి ముఖంపై చెమట కారుతూ వేసుకున్న మేకప్ కూడా పోతుంది. ఇది వారికి చిన్న సమస్యయే అయినా చాలావరకు చికాకును కలిగిస్తుంది. అలాంటి వారు వేసవిలో ఈ చిన్నపాటి చిట్కాలు పాటించడం ద్వారా చెమట ఎక్కువ పట్టకుండా కంట్రోల్ చేసుకోవచ్చు.
 
చాలామంది తరచు స్నానం చేసేటప్పుడు లేదా రాత్రి పడుకునేముందు రోజులో మూడు నుండి 5 సార్లు చల్లని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమంగా చేయడం వలన చర్మరంధ్రాల్లోని వేడిని తగ్గించడమే కాకుండా.. ఎక్కువగా చెమట బయటకు రాదు. అంతేకాకుండా చర్మం కాంతివంతంగా, తాజాగా కనిపిస్తుంది.
 
ఎక్కడికైనా బయటకు వెళ్లేటప్పుడు వేసవిలో వాడే టాల్కమ్ పౌడర్ కొద్దిగా ముఖానికి రాసుకుంటే మంచిది. పౌడర్ వాడడం వలన ముఖంలో అధికంగా వచ్చే చెమటను అడ్డుకుంటుంది. కనుక అసౌకర్యం కలగదు. ఒకవేళ అలా కాదనుకుంటే.. రోజూ రాత్రి నిద్రించే సమయంలో కీర దోసకాయల రసాన్ని ముఖానికి రాసుకోవాలి. ఇలా రోజూ చేస్తుంటే.. ముఖానికి చెమట పట్టడం తగ్గుతుంది. 
 
చివరగా ఫేషియల్ స్వెట్టింగ్ తగ్గించాలంటే.. మరో చిట్కా ఉంది. అదేనండి.. ఐస్‌క్యూబ్స్. వీటిని ఒక వస్త్రంలో చుట్టి ముఖం మీద తరుచు మర్దన చేసుకుంటూ ఉండాలి. ఇలా చేస్తుంటే.. హాయిగా ఉండడంతో పాటు ఎక్కువ చెమట పట్టడం తగ్గుతుంది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments