జాతి విద్వేషాలపై ఫేస్‌బుక్ కఠిన చర్యలు... వారం రోజుల్లో అమల్లోకి..

గురువారం, 28 మార్చి 2019 (17:22 IST)
ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఫేస్‌బుక్ కీలక నిర్ణయం తీసుకుంది. తమకు సంబంధించిన సామాజిక మాధ్యమాల్లో జాతి విద్వేషం, వేర్పాటువాదానికి సంబంధించిన అంశాలను ఇకపై అనుమతిచ్చేది లేదని ఆ సంస్థ ప్రతినిధులు చెప్పారు. కొన్ని రోజుల క్రితం న్యూజిలాండ్ మజీద్‌లపై శ్వేత జాతీయుడు జరిపిన కాల్పుల్లో దాదాపు 50 మంది మరణించారు. 
 
ఉన్మాది మజీద్‌లపై దాడులకు పాల్పడుతూ దానికి సంబంధించిన వీడియోను ప్రత్యక్షంగా ఫేస్‌బుక్‌లో ప్రసారం చేశాడు. దీంతో ఫేస్‌బుక్‌పై అప్పట్లో విమర్శలు వచ్చాయి. వెంటనే నివారణ చర్యలు చేపట్టిన ఫేస్‌బుక్ యాజమాన్యం విద్వేషాలను రెచ్చగొట్టే ప్రకటనలపై నిషేధం విధించింది.
 
న్యూజిలాండ్ సంఘటన వల్ల దెబ్బతిన్న ఫేస్‌బుక్ యాజమాన్యం తమకు సంబంధించిన ఇన్‌స్ట్రాగ్రామ్, ఫేస్‌బుక్‌లో జాతి విద్వేషం, వేర్పాటువాదానికి సంబంధించిన అంశాలను నిషేధిస్తున్నట్లు వెల్లడించింది. జాతి గొప్పదనాన్ని చాటుకునేలా ప్రకటనలు ఉంటే వాటిని అనుమతిస్తామని పేర్కొంది. ఈ నిర్ణయం వారం రోజుల్లో అమలులోకి వస్తుందని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం అవి ఎత్తుకెళ్ళిపోయారు.. పోలింగ్ తేదీ మార్చమని అడుగుతా... కె.ఎ.పాల్