భర్త కోసం నగ్న వీడియో... ఆయనకు షేర్ చేయబోయి అందరికీ చేసేసింది...

శనివారం, 23 మార్చి 2019 (14:37 IST)
స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత చాలామంది తమ వ్యక్తిగత విషయాలను కూడా ఫోన్లలో బంధించేస్తున్నారు. ఇలా చేయడంతో పాటు కొన్నిసార్లు ఆ ఫోటోలు లేదా వీడియోలను గబుక్కున షేర్ చేసేస్తున్నారు. ఆ తర్వాత జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. తాజాగా ఓ మహిళ చేసిన చిన్న పొరబాటు కారణంగా ఆమె భర్తతో పాటు బంధువులు, చివరికి కన్న కొడుకు కూడా ఆమెకు దూరమయ్యాడు. 
 
ఇంతకీ ఆమె ఏం చేసిందయ్యా అంటే... భర్త ఏదో పని మీద ఊరికి వెళ్లాడు. దానితో తను దగ్గర లేకపోవడంతో ఆమె తీవ్రమైన విరహానికి లోనైంది. తన పరిస్థితి ఎలా వుందో తన భర్తకు తెలియజేయాలనుకుని శరీరంపై నూలుపోగు లేకుండా మొత్తం విప్పేసింది. నగ్నంగా వీడియో తీసింది. ఆ వీడియోను భర్తకు ఫేస్ బుక్ ద్వారా షేర్ చేయాలనుకుని ఆ బటన్ నొక్కింది. 
 
ఐతే ఆమెకి ఎఫ్బీ వీడియో షేరింగ్ పైన అవగాహన లేకపోవడంతో ఆ వీడియోను అందరికీ షేర్ చేసేసింది. దీనితో సదరు మహిళ నగ్న వీడియో అందరికీ వెళ్లిపోయింది. ఆమెను అలా చూసిన ఆమె బంధువులు షాక్ తిన్నారు. వెంటనే ఆమెకి ఫోన్ చేసి నగ్న వీడియో సంగతి చెప్పారు. వెంటనే డిలీట్ చేసేలోపుగానే దాన్ని 20 వేలమందికి పైగా చూసేయడం జరిగిపోయింది. 
 
కొందరైతే ఆ వీడియోను పోర్న్ సైట్లలో అప్‌లోడ్ చేసారు. ఆ వీడియోను చివరికి ఆమె కన్నకొడుకు చూసి తన తల్లి ముఖం చూడనని ఆమె వద్దకు వెళ్లలేదు. ఈ మహిళ బల్గేరియాకు చెందినవారు కాగా ఆమె భర్త ఇంగ్లండులో పనిచేస్తున్నాడు. కాగా తను చేసిన పొరబాటుపై సదరు మహిళ వివరణ ఇచ్చుకుని ఇలాంటి పరిస్థితి ఏ మహిళకు రాకూడదని వెల్లడించింది.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం గర్భిణీ మహిళ... ప్రసవానికి ముందు 380 వంటకాలు చేసి....