Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెనిగర్-వెల్లుల్లి రెబ్బల పేస్టుతో అలా చేస్తే... (Video)

Webdunia
గురువారం, 27 ఆగస్టు 2020 (21:40 IST)
ప్రకృతి ప్రసాదించిన వెల్లుల్లితో ఆరోగ్యం ఒక్కటే కాదు అందం కూడా ఇనుమడిస్తుంది. ముఖ్యంగా ముఖంపై ఇబ్బందిపెట్టే మొటిమలను నివారించడంలో బాగా పనిచేస్తుంది. వెల్లుల్లి, బాక్టీరియాను చంపడానికి సహాయపడే యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ మరియు క్రిమినాశక తత్వాలను కలిగి ఉంటుంది. అలాగే, వెల్లుల్లిలో ఉన్న సల్ఫర్ సమ్మేళనాలు పొడిబారేందుకు ఏజెంట్ వలె పనిచేస్తాయి, క్రమంగా మొటిమలను తొలగించడంలో సహాయపడుతుంది. 
 
1. వెల్లుల్లిని చిదిమి, దాని నుండి రసాన్ని వేరు చేయండి. దీనిని ఒక శుభ్రమైన గిన్నెలోకి తీసుకుని అందులో, తాజా కలబంద గుజ్జును జోడించి కలపండి. మొటిమలు మీద రాసి 10 నుండి 15 నిమిషాల పాటు అలాగే వదిలివేయండి. తర్వాత సాధారణ నీటితో శుభ్రపరచండి. ఇలా చేయడం వల్ల మొటిమల సమస్య తగ్గుతుంది.
 
2. ఎగ్ వైట్లో, చర్మం మీద మృతకణాలను తొలగించడంలో, క్రమంగా రంధ్రాలను పూడ్చడంలో సహాయపడే ప్రోటీన్లు మరియు పోషకాలతో నిండి ఉంటాయి. ఒక గిన్నెలో, గుడ్డు నుండి తెల్ల సొనను వేరు చేసి తీసుకోండి. వెల్లుల్లి పేస్ట్, తెల్ల గుడ్డు  మిశ్రమంలా కలపండి. మొటిమల ఉన్నచోట ఈ మిశ్రమాన్ని అప్లై చేయాలి.. కొన్ని నిమిషాల పాటు పొడిగా మారే వరకు అలాగే వదిలివేయండి. పూర్తిగా పొడిబారాక, సాధారణ నీటితో కడిగివేయండి.
 
3. వెల్లుల్లి రెబ్బలను మిక్స్ చేసి, అందులో వెనిగర్ కలిపి, మిశ్రమంగా పేస్టులా వచ్చే వరకు కలపాలి. ఈ మిశ్రమాన్ని మొటిమలు ఉన్న చోట రాయాలి. ఈ మిశ్రమాన్ని ఒక కాటన్ బాల్‌తో అప్లై చేసుకోవచ్చు. ముఖం మీది మిశ్రమం పూర్తిగా ఆరిపోయే వరకు వదిలివేయండి, పొడిబారిన తర్వాత ముఖాన్ని స్వచ్ఛమైన నీటితో శుభ్రం చేయండి. ఉత్తమ ఫలితాల కోసం ప్రతిరోజూ ఈ మిశ్రమాన్ని ఉపయోగించవచ్చు.

 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments