Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుడ్డు సొన, వెల్లుల్లి రేకుతో ప్యాక్..?

Webdunia
శుక్రవారం, 28 డిశెంబరు 2018 (13:58 IST)
కోడిగుడ్డును ఆహారంగానే కాకుండా సౌందర్య సాధనంగా కూడా ఉపయోగపడుతుంది. కోడిగుడ్డులోని న్యూట్రియన్ ఫాక్ట్స్ చర్మం రక్షణకు చాలా దోహదపడుతాయి. చాలామందికి గుడ్డు వాసన అంటే.. అస్సలు పడదు. ఈ వాసన కారణంగానే కోడిగుడ్డును ఎక్కువగా అందానికి వాడనంటున్నారు. ఈ ప్రయోజనాలు తెలుసుకుంటే.. తప్పక గుడ్డు వాడలనిపిస్తుంది. మరి అవేంటో చూద్దాం..
 
కోడిగుడ్డు ఫేస్‌ప్యాక్:
కోడిగుడ్డులోని పచ్చసొన, 2 స్పూన్స్ బాదం నూనె, వెన్న తీసిన పాలు, కొద్దిగా కర్పూరం కలిపి పేస్ట్‌లా తయారుచేయాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి రాసుకుంటూ ఉంటే చర్మం కాంతివంతంగా, మృదువుగా ఉంటుంది.
 
గుడ్డులోని పచ్చసొన 2 స్పూన్, ఫ్రెష్ గులాబీ పువ్వుల రసం 2 స్పూన్స్.. ఈ రెండింటిని బాగా కలిపి ముఖానికి రాసుకోవాలి. అరగంట పాటు అలానే ఉంచి ఆ తరువాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. ఇలా చేస్తే ముఖం ఎంతో సౌందర్యంగా, మృదువుగా తయారవుతుంది. మొటిమలు రావు.
 
కోడిగుడ్డులోని తెల్లసొన 1 స్పూన్, పాల మీగడ 1 స్పూన్, నిమ్మరసం 5 చుక్కలు.. ఈ మూడింటిని బాగా కలిపి, రోజూ రాత్రివేళ పడుకునే ముందు చర్మానికి రాసుకుని మసాజ్ చేయాలి. ఉదయం గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఆ విధంగా చేస్తే మొటిమలు, మచ్చలు రాకుండా ఉంటాయి.
 
మొటిమలున్నవారు వెల్లుల్లి రేకులు మూడు నూరి దాన్ని గుడ్డు తెల్లసొనలో కలిపి.. ఆ మిశ్రమానికి 1 స్పూన్ కాలమైన్ చేర్చి.. ముఖానికి రాసుకుని 20 నిమిషాల తరువాత శుభ్రంగా కడుక్కోవాలి. ఈ ప్యాక్ మొటిమల్ని బాగా తగ్గిస్తుంది.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments