పెరుగుతో అందం పెరుగుతుంది... ఎలాగంటే?

పెరుగు తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలు అందటమే కాకుండా ఇది శరీర ఉష్ణోగ్రతను కూడా క్రమబద్దీకరిస్తుంది. దీనిని కేవలం ఆరోగ్యపరంగా మాత్రమే కాకుండా సౌందర్యలేపనంగా కూడా ఉపయోగించవచ్చు. అదెలాగంటే... 1. పెరుగులో ల్యాక్టిక్ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి.

Webdunia
గురువారం, 26 ఏప్రియల్ 2018 (21:17 IST)
పెరుగు తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలు అందటమే కాకుండా ఇది శరీర ఉష్ణోగ్రతను కూడా క్రమబద్దీకరిస్తుంది. దీనిని కేవలం ఆరోగ్యపరంగా మాత్రమే కాకుండా సౌందర్యలేపనంగా కూడా ఉపయోగించవచ్చు. అదెలాగంటే...
 
1. పెరుగులో ల్యాక్టిక్ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. దీనిలో విటమిన్స్, మినరల్స్ కూడా ఉంటాయి. ఇవి చర్మాన్ని హైడ్రేడ్ చేయడంలో ముఖ్యపాత్ర వహిస్తాయి. ఇది ముఖాన్ని తెల్లగా, మృదువుగా మార్చటంలో సహాయపడుతుంది. పెరుగులో కొద్దిగా బియ్యపు పిండిని కలిపి ముఖానికి రాసుకొని 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. బియ్యపు పిండిలో యాంటీఏజింగ్ గుణాలు అధికంగా ఉండటం వల్ల ఇది చర్మంపై ఉన్న ముడతలను తగ్గించి మృదువుగా, కాంతివంతంగా మారుస్తుంది. దీనిని వారానికి మూడుసార్లు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
 
2. ఒక టీ స్పూన్ పెరుగులో రెండు టీ స్పూన్ల కలబంద గుజ్జుని కలిపి ముఖానికి పట్టించి ఆరిన తర్వాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉన్న మృతకణాలు తొలగిపోయి ముఖం తాజాగా కనిపిస్తుంది.
 
3. రెండు టీ స్పూన్ల పెరుగులో ఒక టీ స్పూన్ టమోటా రసం, ఒక టీ స్పూన్ తేనె కలిపి ముఖానికి మర్దన చేసి పావుగంట తర్వాత కడిగేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వల్ల ముఖం తెల్లగా, అందంగా మారుతుంది.
 
4. పెరుగులో కొద్దిగా శనగపిండి, చిటికెడు పసుపు కలిపి ముఖానికి రాసుకొని అరగంట తర్వాత కడిగేయాలి. ఇందులో ఉండే విటమిన్స్ ప్రోటీన్స్ ముఖాన్ని మెరిసిపోయేలా, కాంతివంతంగా చేస్తాయి.
 
5. పెరుగులో కొన్ని కీరదోస ముక్కల్ని వేసి ఫేస్టులా చేయాలి. దీనిని ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇది చర్మంపై ఉన్న మచ్చలను తొలగించి ముఖానికి మంచి అందాన్ని ఇస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వెనక్కి తగ్గేదేలేదంటున్న ఇరాన్.. పౌరులు యుద్ధంలో పాల్గొనాలని పిలుపు

ఏపీ దేవాదాయ శాఖ ఏసీ కాళింగిరి శాంతి అరెస్టు

ఈ రాత్రికి ఇరాన్ నాగరికత అంతం... డోనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు

డ్రాగన్ కంట్రీ వంకరబుద్ధి.. హార్మూజ్ జలసంధిపై కన్ను... భారత్‌కు గట్టిదెబ్బ?

మాకు తిక్కరేగితే ఆ పత్రిక కార్యాలయాన్ని తగలబెట్టేస్తాం : ఆర్కే రోజా హెచ్చరిక

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AA22: స్పైడర్-మ్యాన్, అవెంజర్స్ తరహాలో AA22 చిత్రం ఉండబోతుందా ?

K. Raghavendra Rao: మహిళలకు డైమండ్ డెకాయిట్ చిత్రం ఉచితం

లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఫుల్-లెంగ్త్ ఎంటర్టైనర్ : ప్రొడ్యూసర్ శివప్రసాద్

VV Vinayak: వివేక్ మిశ్రా, శృతిక జంటగా అహోం.ప్రారంభం

AA22 x A6 ప్రీ లుక్ పోస్టర్‌.- అంచనాలు రెట్టింపు చేసిన టీం

తర్వాతి కథనం
Show comments