Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ముల్తానీ మట్టితో చర్మానికి ఎంత మేలో తెలుసా?

ముల్తానీ మట్టికి చర్మాన్ని పూర్తిగా శుద్ధి చేసే శక్తి ఉంది. చర్మంపై ఉన్న మురికిని శుభ్రంగా వదిలించేస్తుంది. దీంతో ముల్తానీ మట్టిని రోజ్ వాటర్, గంధంచెక్క పొడితో కలిపి మెత్తటి పేస్ట్‌లా చేసుకుని మెడపై ప

Advertiesment
ముల్తానీ మట్టితో చర్మానికి ఎంత మేలో తెలుసా?
, గురువారం, 19 ఏప్రియల్ 2018 (12:24 IST)
ముల్తానీ మట్టికి చర్మాన్ని పూర్తిగా శుద్ధి చేసే శక్తి ఉంది. చర్మంపై ఉన్న మురికిని శుభ్రంగా వదిలించేస్తుంది. దీంతో ముల్తానీ మట్టిని రోజ్ వాటర్, గంధంచెక్క పొడితో కలిపి మెత్తటి పేస్ట్‌లా చేసుకుని మెడపై ప్యాక్‌లా వేసుకుంటే నల్లదనం తగ్గిపోతుంది.వారానికోసారి ఇలా చేస్తే మంచి ఫలితం వుంటుంది. 
 
జిడ్డు చర్మం గల వారికి తరచుగా మొటిమలు వస్తుంటాయి. అందుకే జిడ్డు చర్మం గల వారు ముల్తానీ మట్టి రెండు చెంచాలు, ఒక చెంచాడు టమాటా జ్యూస్, పావు చెంచా నిమ్మరసం, ఒక చెంచా తేనె అన్నీ కలిపి ముఖంపై ప్యాక్‌లా వేసుకుని 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే ముఖం మెరిసిపోతుంది.  
 
అలాగే కమలా లేదా నారింజ పండ్ల తొక్కల పొడి, ముల్తానీ మట్టిని సమాన భాగాలుగా తీసుకుని రోజ్ వాటర్ కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి.. 15 నిమిషాల తర్వాత కడిగేస్తే.. జిడ్డు చర్మం నుంచి ఉపశమనం లభిస్తుంది. వయసు మీద పడుతున్న కొద్దీ చర్మం ముడతలు పడుతుంది. అలాంటి వారు ముల్తానీ మట్టి సాయం తీసుకోవచ్చు. 
 
ఒక టేబుల్ స్పూను ముల్తానీ మట్టి అంతే మొత్తం పెరుగుతో కలుపుకోవాలి. పెరుగు లేకపోతే నీరు వాడుకోవచ్చు. ఓ గుడ్డులోని తెల్లసొనను తీసుకుని ఈ మిశ్రమంతో కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపిన తర్వాత ముఖం, ముడతలు కనిపించే చోట ప్యాక్‌లా వేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత కడిగేసుకుంటే ముడతలకు చెక్ పెట్టవచ్చునని బ్యూటీషియన్లు సూచిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఖర్జూరాలు తప్పక తినాల్సిందే..