Webdunia - Bharat's app for daily news and videos

Install App

బొప్పాయి గుజ్జులో పెరుగును కలుపుకుని ముఖానికి రాసుకుంటే?

చాలామందికి చర్మం ఎక్కువగా పొడిబారుతుంటుంది. అటువంటి సమస్యలను ఎదుర్కొనేందుకు ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలను పొందవచ్చును. పెసరపిండిలో కొద్దిగా తేనె, పచ్చిపాలను కలుపుకుని చర్మానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇ

beauty tips
Webdunia
మంగళవారం, 28 ఆగస్టు 2018 (18:06 IST)
చాలామందికి చర్మం ఎక్కువగా పొడిబారుతుంటుంది. అటువంటి సమస్యలను ఎదుర్కొనేందుకు ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలను పొందవచ్చును. పెసరపిండిలో కొద్దిగా తేనె, పచ్చిపాలను కలుపుకుని చర్మానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి మూడుసార్లు చేయడం వలన చర్మం మృదువుగా మారుతుంది.
 
బొప్పాయి గుజ్జులో కొద్దిగా పెరుగు, తేనెను కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేస్తే చర్మం పొడిబారకుండా ఉంటుంది. బంతిపువ్వుల రేకులను ఎండబెట్టుకుని వాటిని పొడిచేసుకోవాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా రోజ్ వాటర్ కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. అరగంట తరువాత శుభ్రం చేసుకుంటే చర్మం మెరిసిపోతుంది. 
 
కీరదోసను పేస్ట్‌లా చేసుకుని అందులో కొద్దిగా నిమ్మరసం, తేనె కలుపుకుని ఫేస్ ప్యాక్‌లా వేసుకుంటే ఈ శీతాకాలంలో మంచిది. ప్రతిరోజూ నాలుగైదు లీటర్ల నీళ్లను తీసుకుంటే చర్మం సహజసిద్ధంగా ఉంటుంది. రాత్రి సమయంలో శరీరానికి నూనె రాసుకుని ఉదయాన్నే స్నానం చేస్తే చర్మం మృదువుగా మారుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వలస విధానం మరింత కఠినతరం : హెచ్1బీ వీసాదారులకు హెచ్చరిక

తెలంగాణాలో రాగల రెండు రోజుల వడగండ్ల వానలు

మధ్యప్రదేశ్‌లో విషాదం : బావిలోని విషవాయువులకు 8 మంది మృతి

ప్రియురాలితో కలిసి ఆమె భర్తను హత్య చేసిన ఉపాధ్యాయుడు!!

సిల్వర్ జూబ్లీ వివాహ వేడుకలు : భార్యతో కలిసి డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి భర్త మృతి (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ దర్శకుడు మనోజ్ కుమార్ ఇకలేరు...

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

తర్వాతి కథనం
Show comments