టీ పొడి, బీట్‌రూట్ రసంతో జుట్టు ఒత్తుగా..?

Webdunia
శనివారం, 3 నవంబరు 2018 (17:03 IST)
మహిళలు అందంగా ఉండాలని ఏవేవో క్రీములు ఫేస్‌ప్యాక్స్ వాడుతుంటారు. కొందరైతే ఎలాంటివి వాడినా వారిలో ఏ మాత్రం తేడా కనిపించదు. అందుకు ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలు పొందవచ్చును..
 
1. శీకాయ గింజలను ఎండబెట్టుకుని పొడిచేసి అందులో కొద్దిగా తేనె, ఆలివ్ నూనె కలిపి ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే ముఖం తాజాగా మారుతుంది. 
 
2. కరివేపాకులను పొడిచేసి అందులో కొద్దిగా నీరు, వంటసోడా కలిపి ముఖానికి, మెడకు రాసుకోవాలి. అరగంట తరువాత శుభ్రం చేసుకుంటే ముఖంపై గల నల్లటి మచ్చలు తొలగిపోతాయి. 
 
3. టీ పొడి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మరి అందానికి ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం.. టీ పొడిని నీటిలో మరిగించుకుని అందులో గోరింటాకు పొడి, బీట్‌రూట్ రసం కలిపి కాసేపు అలానే ఉంచాలి. అది బాగా చల్లారిన తరువాతు తలకు రాసుకోవాలి. గంట పాటు అలానే ఉంచుకుని ఆ తరువాత తలస్నానం చేయాలి. ఇలా తరచుగా చేస్తే జుట్టు రాలే సమస్య తొలగిపోతుంది.
 
4. ఉల్లిపాయలు పేస్ట్‌లా చేసుకుని అందులో కొద్దిగా పెరుగు, ఉప్పు, నిమ్మరసం కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. క్రమంగా ఇలా చేస్తే ముఖం ముడతలు తొలగిపోతాయి. 
 
5. గోరింటాకు పొడిలో కొద్దిగా కీరదోస రసం, కలబంద గుజ్జు కలిపి ముఖానికి, మెదడు రాసుకోవాలి. గంట తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే నల్లటి మచ్చలు, వలయాలు తొలగిపోతాయి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇరాన్‌తో ప్రపంచానికి ముప్పు : ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు

టెక్సాస్ నుంచి మంగుళూరుకు చేరిన ఎల్పీజీ నౌక - రష్యా నౌక కూడా...

ఈ నెల 25వ తేదీన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నా : జీవన్ రెడ్డి

పాక్‌పై అమెరికా దాడి చేస్తే... మేం భారత్‌పై దాడి చేస్తాం : అబ్దుల్ బాసిత్

సరికొత్త రికార్డును నెలకొల్పిన ప్రధాని.. సుధీర్ఘకాలం ప్రభుత్వ అధినేతగా మోడీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుంటూరు నగర నడిబొడ్డున స్టూడియోస్ 81

ఉగాది రోజు నుంచి సీతా పయనం మూవీ సన్ నెక్స్ట్‌లో స్ట్రీమింగ్

దర్శకులను సూపర్ స్టార్లు తొక్కేస్తున్నారు : కంగనా రనౌత్

Kiran: అప్పట్లో టీవీకి ఉన్న ప్రాధాన్యత నేపథ్యంగా తిమ్మరాజుపల్లి టీవీ తీశాం

గద్దర్ అవార్డ్స్ వేడుకలో గడబిడలు - నిర్వాహకులపై విమర్శలు ?

తర్వాతి కథనం
Show comments