అతడు(శంకర్ అకాడమీ) ఐఏఎస్-ఐపీఎస్‌ల కర్మాగారం... భార్యతో గొడవపడి వెళ్లిపోయాడు...

శనివారం, 13 అక్టోబరు 2018 (17:47 IST)
శంకర్ ఐఏఎస్ అకడామీ అంటే భారతదేశంలో ఓ సంచలనం. అతడు ఐఏఎస్-ఐపీఎస్‌ల తయారీ కర్మాగారం అని అంటే అతిశయోక్తి కాదేమో. దేశ వ్యాప్తంగా ఆయన నెలకొల్పిన శంకర్ ఐ.ఎ.ఎస్ అకడామీ ద్వారా ఎంతోమంది ఇప్పుడు సివిల్స్ లో ఉత్తీర్ణులై ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా వున్నారు. సుమారు 900 మంది అధికారులు ఆయన అకాడమీలో చదివినవారు కావడం గమనార్హం. అలాంటి గొప్ప మేధావి ఏదో విషయంపై భార్యతో గొడవపడి గురువారం ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన వయసు 41 సంవత్సరాలు. ఈ వార్తను ఆయన విద్యార్థులకు, దేశంలోని మేధావులు జీర్ణించుకోలేకపోతున్నారు.
 
శంకర్ అకాడమీ గురించి చెప్పాలంటే ఆయన ఒక్కో మెట్టు ఎక్కిన విధానాన్ని తెలుసుకోవాలి. తమిళనాడులోని నామక్కల్ జిల్లాలో వ్యవసాయ కుటుంబంలో జన్మించిన శంకర్‌కి ఐఏఎస్ కావాలన్నది కల. అందుకోసం ఎంతగానో శ్రమించారు. అప్పట్లో తమిళనాడులో ఐ.ఎస్.ఎస్ చదవడానికి ప్రామాణిక శిక్షణా కేంద్రాలు లేదా మార్గదర్శులు లేని వాతావరణం. అందుకే ఎక్కువగా ఉత్తరాదిలో వున్న కేంద్రాలపై ఆధారపడేవారు. పైగా ఐఏఎస్, ఐపీఎస్ అంటే ఉత్తరాదివారికే అనే పరిస్థితి కూడా వుంది. ఈక్రమంలో శేఖర్ ఎంతగానో శ్రమించారు. కానీ ఫెయిల్ అయ్యారు. ఒక అపజయం నుంచే జయం కోసం చేయాల్సింది నేర్చుకోవాలి అని అనుకున్న శంకర్, తనలాంటివారికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.
 
ఈ క్రమంలో తొలుత కేవలం 36 మందితో అకాడమీని ప్రారంభించారు. అలా ప్రారంభమైన ఈ అకాడమీ నేడు సంవత్సరానికి 1500 విద్యార్థులకు శిక్షణ ఇచ్చే స్థాయికి చేరుకుంది. ఇప్పటి వరకు ఈ అకాడమీ నుంచి 900 మంది ఐఐఎస్ పరీక్షలో విజయం సాధించి భారతదేశంలోని అనేక రాష్ట్రాలలో వివిధ ముఖ్యమైన పదవులలో పనిచేస్తున్నారు.
 
విద్యార్థుల సంఖ్య పెరగడంతో తన అకాడమీని రెండేళ్ల క్రితం చెన్నైలోని అన్నానగర్‌లో ప్రారంభించారు. ఇక్కడ ఐఏఎస్ పరీక్షలు మాత్రమే కాకుండా, తమిళనాడు స్థాయి పోటీ పరీక్షలు తదితర ప్రాముఖ్య కోర్సులకు శిక్షణ ఇస్తున్నారు. ఇంకా శంకర్ అకాడమీని ఇతర రాష్ట్రాలకూ విస్తరించే పనులు చేశారు. ఐతే ఇంతటి మేధావి అయిన శంకర్ కుటుంబంలో తలెత్తిన గొడవల కారణంగా ఆత్మహత్య చేసుకోవడం విషాదం.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ట్విట్టర్‌లో #GautamRodeLastBdayCelebration ట్రెండింగ్...