Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పూజ గదిలో దేవుడి పటాలే వుండాలి.. ఆ ఫోటోలు వుండకూడదు..

పూజ గదిలో దేవుడి పటాలే వుండాలి.. పితృదేవతల ఫోటోలు అంటే తాత ముత్తాతల ఫోటోలు వుండకూడదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.

Advertiesment
పూజ గదిలో దేవుడి పటాలే వుండాలి.. ఆ ఫోటోలు వుండకూడదు..
, శుక్రవారం, 5 అక్టోబరు 2018 (11:27 IST)
పూజ గదిలో దేవుడి పటాలే వుండాలి.. పితృదేవతల ఫోటోలు అంటే తాత ముత్తాతల ఫోటోలు వుండకూడదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. దేవుడి పటాల కిందనే తాతముత్తాల ఫోటోలు వుండాలి. దేవుడి ఫోటోలను, తాతముత్తాతల ఫోటోలను పక్కపక్కనే పెట్టకూడదు. 


పూజగదిలో మరణించిన వారి ఫోటోలను పెట్టకుండా వుండటం మంచిది. ఒకవేళ పెట్టాలనిపిస్తే.. హాలులో ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ పూజగదిలో వారి ఫోటోలను వుంచితే దురదృష్టం తప్పదని వాస్తు చెప్తోంది. 
 
చాలామంది పెద్దలకు గౌరవం ఇచ్చే భావనతో పూజగదిలో మరణించినవారి ఫోటోలు పెడుతుంటారు. కానీ అవి మన దృష్టిని, ఆలోచనలను మరల్చడమే కాకుండా బాధాకరమైన జ్ఞాపకాలను మిగుల్చుతాయని వాస్తు నిపుణులు అంటున్నారు. అందుచేత తాతముత్తాల ఫోటోలను హాలులు కాస్త ఎత్తుగా లైట్ల డెకరేషన్‌తో అమర్చుకోవడం మంచిదని వారు సూచిస్తున్నారు.
 
అలాగే పూజ గదిలో గంటను ఏర్పాటు చేయడం సరికాదు. పూజ గది ఆలయం కాదు. అది మన వ్యక్తిగత ధ్యానానికి, పూజకు ఉద్దేశించింది కనుక పెద్ద శబ్దాలు లేకుండా ఉండటం మంచిది. పూజ గదిలో డబ్బు, ఇతర విలువైన వస్తువులను అక్కడ దాచడం సరికాదు.
 
ఇకపోతే.. పూజగదిని ఎప్పుడూ శుభ్రంగా వుంచుకోవాలి. పూజగదికి లేత రంగులను వేసుకోవచ్చు. తెలుపు, లేత పసుపు లేదా లేత నీలాన్ని ఎంచుకోవచ్చు. దీనివల్ల మనస్సు ప్రశాంతంగా ఉండి దేవుడిపై దృష్టి పెట్టడం సులభమవుతుందని వాస్తు నిపుణులు చెప్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు... 17న స్వర్ణ రథోత్సవం