Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనావైరస్‌ సమయంలో తట్టు కూడా ప్రబలే ప్రమాదముందా?

Webdunia
గురువారం, 14 మే 2020 (14:16 IST)
కరోనావైరస్ ప్రపంచవ్యాప్తంగా ప్రబలుతున్న నేపథ్యంలో తట్టు వ్యాధికి వేసే టీకాలు తగిన సమయంలో వేయడంలో జాప్యం జరుగుతోంది. దీంతో తట్టు వ్యాధి ప్రబలే ప్రమాదం ఉంది. 37 దేశాలలో సుమారు 11 .7 కోట్ల మంది పిల్లలకి తగిన సమయానికి టీకా లభించకపోవచ్చని యూనిసెఫ్ తెలిపింది.

 
మీజిల్స్, మమ్స్, రుబెల్లా (ఎంఎంఆర్) టీకా సరిగ్గా తీసుకోని యూరోపియన్ దేశాలలో తట్టు వ్యాధి విపరీతంగా ప్రబలింది. దేశంలో పెరుగుతున్న తట్టు కేసుల కారణంగా తట్టు వ్యాధి రహిత దేశంగా బ్రిటన్ తన స్థానాన్ని కోల్పోయింది. తట్టు వలన వచ్చే దగ్గు, దద్దుర్లు, జ్వరాన్ని రెండు మోతాదుల ఎంఎంఆర్ టీకాతో నివారించవచ్చు. ఇది బ్రిటన్‌లో పిల్లలందరికీ ఉచితంగా వేస్తారు.

 
ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్ష్యానికి అనుగుణంగా బ్రిటన్‌లో 95 శాతం మంది పిల్లలకు మొదటి మోతాదు టీకా మందు వేశారు. అయితే 87.4 శాతం మందికి మాత్రమే రెండో మోతాదు లభించింది. తట్టు వ్యాధికి వ్యాప్తి చెందే లక్షణం ఉండటంతో టీకా మందు మోతాదులో ఏ మాత్రం తేడా వచ్చినా ప్రభావం చూపిస్తుంది.

 
తట్టు వ్యాధి వ్యాప్తి చెందని దేశాలు తాత్కాలికంగా ఈ టీకా వేయడం వాయిదా వేయవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇప్పటికే అనేక దేశాలు కరోనావైరస్ మహమ్మారి వలన టీకా వేయడం వాయిదా వేశాయి. వీటిలో బంగ్లాదేశ్, బ్రెజిల్, బొలీవియా, కంబోడియా, చాడ్, చిలీ, కొలంబియా, డిజిబౌటీ, డొమినికన్ రిపబ్లిక్, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఇథియోపియా, హోండూరస్, కజకిస్తాన్, కిర్గిస్థాన్, లెబనాన్, మాల్దీవులు, మెక్సికో, నేపాల్, నైజీరియా, పరాగ్వే, సోమాలియా, దక్షిణ సుడాన్, యుక్రెయిన్, ఉజ్బెకిస్తాన్ ఉన్నాయి.

 
మరిన్ని దేశాలు ఈ సమస్య ఎదుర్కొనే అవకాశం ఉందని యూనిసెఫ్ చెబుతోంది. "కరోనావైరస్ కారణంగా టీకాలు అందించడం ఆలస్యం అయితే, ప్రభుత్వాలు టీకాలు అందని పిల్లలని గుర్తించాలి. సులభంగా ఈ సమస్య బారిన పడేందుకు అవకాశం ఉన్నవారికి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా టీకాలు ఇచ్చే ఏర్పాట్లు చేయాలి. ఇదొక్కటే మన ముందున్న మార్గం" అని యూనిసెఫ్ చెప్పింది.

 
టీకాలు వేయడంలో అవాంతరాలు కొనసాగితే పిల్లలు మరిన్ని ప్రాణాంతక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని యూనిసెఫ్ ప్రతినిధి జోవన రీ అన్నారు. ఇలా జరిగితే ఇప్పటికే ఆరోగ్య సేవల మీద ఉన్న ఒత్తిడి మరింత పెరుగుతుంది, మరోసారి మహమ్మారులు ప్రబలే పరిస్థితికి ఇది దారి తీయవచ్చని ఆమె అన్నారు.

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments