Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనావైరస్: కిమ్ జోంగ్ ఉన్ ఉత్తర కొరియాలో వైరస్ వ్యాప్తి చెందకుండా ఏం చేశారు?

Webdunia
మంగళవారం, 7 ఏప్రియల్ 2020 (18:26 IST)
ఉత్తర కొరియా తమ దేశంలో ఒక్క వ్యక్తి కూడా కరోనా వైరస్‌కు గురికాలేదని చెబుతోంది. ఆ దేశం చెబుతున్న మాటలపై ఇప్పుడు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్నో ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. దేశ సరిహద్దులను మూసివేయడం లాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల తమ దేశంలో వైరస్ వ్యాపించలేదని ఉత్తర కొరియా చెబుతోంది.
 
కానీ, దక్షిణ కొరియాలో అమెరికా ఆర్మీ సీనియర్ కమాండర్ ఉత్తర కొరియా వాదనలను అబద్ధాలని, అసాధ్యం అని చెబుతున్నారు. అయితే, ఉత్తర కొరియా నిపుణుడు ఒకరు బీబీసీతో “అక్కడ వైరస్ కేసులు లేవని చెప్పలేం. కానీ, అది భారీ స్థాయిలో వ్యాపించే అవకాశాలు తక్కువ” అని చెప్పారు.
 
జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా పది లక్షలకు పైగా కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 53 వేల మందికి పైగా మృతి చెందారు. ఉత్తర కొరియాలో ఇప్పటివరకూ ఒక్క వ్యక్తికి కూడా కరోనావైరస్ వ్యాపించలేదని ఆ దేశ సెంట్రల్ యాంటీ-ఎపిడమిక్ ప్రధాన కార్యాలయం డైరెక్టర్ పాక్ మ్యాంగ్-సూ వార్తా సంస్థ ఎఎఫ్‌పీతో చెప్పారు.
 
“మేం ఈ వైరస్ వ్యాపించకుండా మొదటి నుంచే జాగ్రత్తలు తీసుకున్నాం. విదేశాల నుంచి వచ్చిన వారికి పరీక్షలు చేయడం. వారిని క్వారంటైన్‌లో పెట్టడం లాంటి చర్యలు చేపట్టాం. వారి అన్ని వస్తువులనూ పూర్తిగా శానిటైజ్ చేశాం. మా భూ, వైమానిక, సముద్ర మార్గాలను మూసివేశాం” అని ఆయన చెప్పారు..
 
ఉత్తర కొరియా వాదన నిజమే అయ్యుంటుందా?
దక్షిణ కొరియాలోని అమెరికా ఆర్మీ కమాండర్ జనరల్ రాబర్ట్ అబ్రామ్స్ ఉత్తర కొరియా వాదనల్లో నిజం లేదన్నారు. ఆయన సీఎన్ఏ, వాయిస్ ఆఫ్ అమెరికాలకు ఇచ్చిన సంయుక్త ఇంటర్వ్యూలో “మాకు లభించిన సమాచారం ప్రకారం అలా జరగడం అసాధ్యం అని మాత్రమే నేను మీకు చెప్పగలను” అన్నారు.
 
“అయితే, ఉత్తర కొరియాలో మొత్తం ఎన్ని కరోనా వైరస్ కేసులు ఉండచ్చు అనేది కూడా పక్కాగా ఏదీ చెప్పలేం” అని ఆయన అన్నారు. అమెరికా వెబ్‌సైట్ ఎన్‌కే న్యూస్ మేనేజింగ్ ఎడిటర్ ఆలివ్ హాటమ్ కూడా ఉత్తర కొరియాలో వైరస్ కేసులు ఉన్నాయనే భావిస్తున్నారు.
 
ఉత్తర కొరియా సరిహద్దులు చైనా, దక్షిణకొరియాలతో కలుస్తాయి కాబట్టి, ఆ దేశంలో ఒక్క కరోనా కేసు కూడా లేదని మనం అసలు అనుకోలేం.. ఉత్తర కొరియాకు చైనాతో ఉన్న వాణిజ్య సంబంధాల స్థాయిని బట్టి చూస్తే, ఆ దేశంలో కరోనా కేసులే లేవంటే, నాకు అసలు నమ్మకం కుదరడం లేదు” అన్నారు. అయితే, ఉత్తర కొరియాలో కరోనా భారీ స్థాయిలో వ్యాపించే అవకాశాలు కూడా తక్కువని ఆయన చెప్పారు.
 
ఉత్తర కొరియా వైరస్ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కుంది?
కరోనావైరస్ వ్యాప్తిని అడ్డుకోడానికి మిగతా చాలా దేశాలతో పోలిస్తే ఉత్తర కొరియా చాలా వేగంగా, సమర్థవంతంగా చర్యలు చేపట్టిందనడంలో ఎలాంటి సందేహం లేదు. అది జనవరి నెల చివరి నుంచే తమ సరిహద్దులు మూసివేసింది. తర్వాత ప్యాంగ్యాంగ్ వచ్చే వందలాది విదేశీయులను క్వారంటైన్లో ఉంచింది. ఆ సమయంలో చైనాలో వైరస్ చాలా వేగంగా వ్యాపిస్తోంది. ఎన్‌కే న్యూస్ రిపోర్ట్ ప్రకారం ఉత్తర కొరియా తన 10 వేల మంది పౌరులను ఐసొలేషన్‌లో ఉంచింది. 500 మంది ఇప్పటికీ క్వారంటైన్లో ఉన్నారు.
 
ఉత్తర కొరియాలో ప్రజలకు కరోనా వైరస్ గురించి తెలుసా?
ఉత్తర కొరియాలో చాలామందికి కరోనా వైరస్ గురించి ‘చాలా కొద్దిగా’ మాత్రమే తెలుసి ఉంటుందని ఆలివ్ హాటమ్ భావిస్తున్నారు. “అక్కడ మీడియా కవరేజ్ చాలా ఎక్కువగా ఉంది. వార్తాపత్రికల్లో ప్రతి రోజూ ఒక పేజీ నిండా దేశంలో, అంతర్జాతీయంగా ఉత్తర కొరియా ఎలాంటి పరిస్థితులను ఎదుర్కుంటోందో చెబుతున్నారు” అన్నారు. “ఉత్తర కొరియాలో ప్రజలకు వైరస్‌ను ఎలా అడ్డుకోవాలో కూడా నేర్పిస్తున్నారని” సోల్‌లో ఉన్న కుకమిత్ యూనివర్సిటీ పరిశోధకులు ఫ్యోండోర్ టెరటిటిస్కీ చెప్పారు.
 
ఉత్తర కొరియాలో ఆరోగ్య సదుపాయాలుఎలా ఉన్నాయి?
ఉత్తర కొరియాలో వివిధ ప్రాంతాల్లో వివిధ స్థాయి ఆరోగ్య సదుపాయాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఉత్తర కొరియా ఆరోగ్య వ్యవస్థ ఆ దేశంలాగే తలసరి ఆదాయం ఉన్న మిగతా దేశాలతో పోలిస్తే చాలా మెరుగ్గా పనిచేస్తోందని ఫ్యోండర్ టెరటిటిస్కీ అన్నారు.
 
“ఉత్తర కొరియా చాలా పెద్ద సంఖ్యలో తమ డాక్టర్లకు శిక్షణ ఇచ్చింది. అయితే అక్కడి డాక్టర్లకు పశ్చిమ దేశాలతో పోలిస్తే తక్కువ అర్హతలు ఉంటాయి. వారితో పోలిస్తే జీతాల కూడా తక్కువే. కానీ, వారు తమ పౌరుల ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను చాలా బాగా చూసుకోగలరు” అని చెప్పారు.
 
ఆలివ్ హాటమ్ కూడా టెరటిటిస్కీతో ఏకీభవించారు. కానీ, “ఉత్తర కొరియా డాక్టర్లు మామూలు వ్యాధులకు సమర్థంగా చికిత్స అందించగలరు. కానీ కరోనావైరస్ లాంటి తీవ్ర సమస్యలను ఎదుర్కోడానికి వారికి మరింత మెరుగైన మెడికల్ పరికరాలు, మెరుగైన ఆరోగ్య సదుపాయాల అవసరం అవుతుంది” అని కూడా చెప్పారు. ఉత్తర కొరియాపై విధించిన ఆంక్షల వల్ల కూడా కొత్త వైద్య పరికరాలు కొనుగోలు చేయడం వారికి కష్టంగా మారింది అన్నారు.
 
“నగరాల్లో మెరుగైన ఆరోగ్య సదుపాయాలు ఉన్నాయి. కానీ వారితో పోలిస్తే, గ్రామీణ ప్రాంతంలో ఉండేవారికి అలాంటి సదుపాయాలు లభించడం కష్టం అవుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఆస్పత్రులకు నిధుల కొరత కూడా ఉంది. అక్కడ ఆ ఆస్పత్రుల్లో నీరు, విద్యుత్ సరఫరా కూడా సరిగా ఉండదు” అని ఆలివ్ హాటమ్ చెప్పారు.
 
ఉత్తర కొరియా వైరస్ కేసులు ఎందుకు దాస్తోంది?
కరోనావైరస్ కేసులు తమ దేశంలో కూడా ఉన్నాయని ఉత్తర కొరియా అంగీకరిస్తే అది వారి ఓటమి సంకేతం అవుతుంది. “ఉత్తర కొరియా ఈ వైరస్ నుంచి ఎలా తట్టుకుంటోందో దాని గురించి చాలా ప్రచారం జరుగుతోంది. అక్కడ వైరస్ కేసులు ఉన్నాయి అనే అనుకుంటే, అప్పుడు అది దానికి ఓటమి అంగీకరించడం లాగే అవుతుంది. దానివల్ల ఉత్తరకొరియా ప్రజల్లో ఒక భయం లాంటిది ఏర్పడుతుంది. ప్రజలు పెద్ద సంఖ్యలో పారిపోడానికి ప్రయత్నిస్తారు, దానివల్ల దేశంలో అస్థిరత నెలకొంటుంది. వైరస్ వ్యాప్తి మరింత పెరగవచ్చు” అని ఆలివ్ హాటమ్ చెప్పారు.
 
ఉత్తర కొరియా వైరస్ కేసులు దాచిపెట్టి, తన ఇమేజ్ కాపాడుకోవాలని ప్రయత్నిస్తోంది అని ఫ్యోండోర్ టెరటిటిస్కీ భావిస్తున్నారు. “ఉత్తర కొరియా తన ఇమేజ్ నాశనం అయ్యేలా బయటికి ఎలాంటి సమాచారం ఇవ్వాలని అనుకోవడం లేదు. మీ దగ్గర చెప్పుకోడానికి ఏదైనా మంచి కారణం లేనంతవరకూ, ఏదీ చెప్పవద్దు అనేది వారి ప్రాథమిక నియమం” అని ఆయన చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments