Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెసరపప్పు పొడి సేవిస్తే.. ఏం జరుగుతుందో తెలుసా..?

Webdunia
బుధవారం, 19 డిశెంబరు 2018 (12:56 IST)
పెసరపప్పు చూడడానికి చాలా చిన్నదిగా ఉంటుంది.. కానీ, అది చేసే పనులు మాత్రం చాలా పెద్దవిగా ఉంటాయి. పెసరపప్పులో ప్రోటీన్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, న్యూట్రియన్స్ వంటి ఖనిజాలు అధిక మోతాదులో ఉంటాయి. పెనరపప్పు నలుపు, పసుపు రంగుల్లో ఎక్కువగా లభిస్తాయి. మరి దీనిని తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఓసారి పరిశీలిద్దాం...
 
1. పెసరపప్పును డైట్‌లో చేర్చుకుంటే ఆరోగ్యానికి మంచి ఆయుర్వేద పదార్థంగా పనిచేస్తుంది. పూర్వకాలం నుండే ఈ పప్పును ఉపయోగిస్తున్నారు. ఈ పప్పుతో పొడులు, సూప్స్ వంటి వంటకాలు అధికంగా హోటల్స్‌లోనే ఉపయోగిస్తారు.
 
2. పెసరపప్పులో పొటాషియం, మెగ్నిషియం, కాపర్, జింక్, విటమిన్ బి, ఫైబర్‌తో పాటు మినరల్స్ కూడా ఉన్నాయి. ఈ పెసరపప్పు కాస్త దోరగా వేయించుకుని మెత్తని పొడిలా చేసుకుని తింటే బాగుంటుంది. ఈ పొడిని నేరుగానే తినొచ్చు.. ఎలాంటి సైడ్‌ఎఫెక్ట్ రావు.
 
3. ఈ పెసరపప్పును శుభ్రం చేసి అందులో కొన్ని టమోటా ముక్కలు, ఉప్పు, కారం, పచ్చిమిర్చి, పసుపు, చింతపండు, నీరు పోసి బాగా ఉడికించుకోవాలి. ఈ తయారుచేసిన మిశ్రమాన్ని తాలింపు పెట్టి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా దోహదపడుతుంది. ముఖ్యంగా రక్తప్రసరణను పెంచుతుంది.
 
4. గుండె పట్టేయడం, రక్తపోటు, డయాబెటిస్, ఒబిసిటీ వంటి వ్యాధులు గలవారు తరచు పైన తెలిపిన మిశ్రమాన్ని సేవిస్తే వీటన్నింటి నుండి విముక్తి లభిస్తుంది. కనుక తప్పక డైట్‌లో చేర్చుకోండి.
 
5. క్యాన్సర్ వ్యాధి ఎవరికి వస్తుందని మనం చెప్పలేం. కాబట్టి వారంలో రెండుసార్లు.. ఒక పూట పెసరపప్పుతో చేసిన వంటకాన్ని తింటే.. ఈ వ్యాధి రాదు. ఈ వ్యాధిని ఎదుర్కోవడంలో పెసరపప్పుకు మించిన మరో ఆహారం లేదంటున్నారు నిపుణులు. 
 
6. చాలామందికి గుండె కొట్టుకోవడం ఎక్కువగా ఉంటుంది. దాంతో ఏదో భయంగా, చింతనగా ఉంటుంది. ఇలా జరిగినప్పుడు ఏం చేయాలో తెలియక బాధపడుతుంటారు. అందుకు పరిష్కారం పెసరపప్పు. పెసరపప్పు పొడి ఎప్పుడూ మీ దగ్గరే ఉంచుకోండి. ఈ సమస్య వచ్చినప్పుడు ఈ పొడిని సేవించి కొద్దిగా నీరు తాగండి.. తక్షణమే ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు.. గుండె కొట్టుకోవడం సమాన స్థితికి చేరుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం... ఉత్తారంధ్రకు భారీ వర్ష సూచన!

మీసాలు తిప్పితే రోడ్లు పడవు : మీ కోసం పని చేయనివ్వండి .. పవన్ కళ్యాణ్

హనీమూన్‌కు ఎక్కడికి వెళ్లాలి.. అల్లుడుతో గొడవు.. మామ యాసిడ్ దాడి!!

ఖమ్మం: ‘హాస్టల్‌లో నన్ను లెక్కలేనన్ని సార్లు ఎలుకలు కరిచాయి, 15 సార్లు ఇంజెక్షన్ ఇచ్చారు’

Pawan: మన్యం, పార్వతీపురం జిల్లాల్లో పవన్- డోలీలకు స్వస్తి.. గుడి కాదు.. బడి కావాలి.. (videos)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

నటిగా ఛాలెంజింగ్ పాత్ర డ్రింకర్ సాయి లో పోషించా : ఐశ్వర్య శర్మ

Sriya Reddy: పవన్ కళ్యాణ్ గురించి శ్రియా రెడ్డి ఏమన్నారంటే..?

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

తర్వాతి కథనం
Show comments