Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుదీనా పేస్టే ఫేస్‌ ప్యాక్..?

Webdunia
బుధవారం, 19 డిశెంబరు 2018 (12:32 IST)
పుదీనా ఆరోగ్యానికి దివ్యౌషధంగా పనిచేస్తుంది. పుదీనా అందానికి కూడా అంతే ఉపయోగపడుతుందని బ్యూటీ నిపుణులు చెబుతున్నారు. అంటే.. ఈ చలికాంలో ఏర్పడే చర్మ సమస్యల కారణంగా ముఖం పొడిబారడం, మెుటిమలు రావడం వంటివి జరుగుతుంటాయి. అంతేకాకుండా.. ముఖం ముడతలుగా మారే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. వీటన్నింటికి చెక్ పెట్టాలంటే.. ఈ చిట్కాలు పాటించాలి.. అవేంటో చూద్దాం...
 
1. పుదీనా ఆకులను మెత్తని పేస్ట్‌లా చేసుకుని అందులో గుడ్డులోని తెల్లసొన కలిపి ముఖానికా అప్లై చేయాలి. గంటపాటు అలానే ఉంచి ఆ తరువాత శుభ్రం చేసుకుంటే ముఖం మృదువుగా, తెల్లగా మారుతుంది. పుదీనాలో ఉండే శాలిసైలిక్ అనే ఆమ్లం ముఖంపై మెుటిమలు రాకుండా కాపాడుతుంది.  
 
2. పుదీనా ఆకుల్ని మెత్తగా పేస్ట్ చేసి అందులో చిటికెడు పసుపు కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసే ముందుగా ముఖచర్మాన్ని గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. ఆ తరువాత ముఖానికి పట్టించి, పావుగంటయ్యాక చన్నీళ్లతో కడిగేసుకుంటే ముఖం మృదువుగా మారుతుంది.
 
3. పుదీనా రసంలో బొప్పాయి రసం కలిపి చర్మ దురదలుగా ఉన్న ప్రాంతాల్లో రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. పుదీనా చర్మం ముడతలు పడకుండా, త్వరగా వృద్ధాప్య ఛాయలు రాకుండా చూడటంలో సహాయపడుతుంది.
 
4. పుదీనా ఆకులతో తయారుచేసిన నూనె మార్కెట్లో దొరుకుతుంది. ఈ నూనెను వాడితే జుట్టు చక్కగా ఎదిగేందుకు తోడ్పడుతుంది. చుండ్రు సమస్య నుండి బయటపడేస్తుంది. మాడు మీద పొరలు పొరలుగా పొట్టు ఊడకుండా సంరక్షిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బాలీవుడ్ నటుడు అజాజ్ ఖాన్ భార్య అరెస్టు!!

ఏపీలో ఒక రోజు ముందుగానే సామాజిక పింఛన్ల పంపిణీ.. నేమకల్లుకు సీఎం బాబు

ఆంధ్ర నుంచి ఆఫ్రికాకు రేషన్ బియ్యం, కాకినాడ పోర్టు స్మగ్లింగ్ కేంద్రంగా మారిందా?

రేవంత్ రెడ్డి "ఏఐ సిటీ"కి శంకుస్థాపన ఎప్పుడో తెలుసా?

హైదరాబాద్‌- 50వేల కేసులు, రూ.10.69 కోట్ల ఫైన్.. 215మంది మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?

పార్టీ ఇచ్చిన 'సిటాడెల్' టీం... సమంత డ్యాన్స్.. Video Viral

అతను స్వార్థం తెలియని ప్రజానేత... రాజ్యసభ సీటుపై మెగా బ్రదర్ ట్వీట్

తర్వాతి కథనం
Show comments